జన సందోహంతో కదం తొక్కిన రామాపురం
బాణసంచాలతో దద్దరిల్లిన రామాపురం టౌన్
కార్యకర్తలు అభిమానుల ఉత్సాహం మధ్య సాగుతున్న మండిపల్లి ఎన్నికల ప్రచారం
ప్రతిచోట పూలదండలు మంగళహారతులతో అభిమానం చాటుకున్న మహిళలు
తమ అభిమాన నాయకుడుకి అడుగడుగునా పూలబాట..
కనీవిని ఎరగని రీతిలో వేలాదిమంది స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలు అభిమానులు ప్రజలు
ఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపిస్తే సంక్షేమంతో కూడిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి అందేలా చేస్తామని తెలియజేసిన మండిపల్లి.చిన్న సన్న కారు పరిశ్రమలని స్థాపించి స్థానిక యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తా మండిపల్లి.అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం: సోమవారం రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రామాపురం మండలం నల్లగుట్ట పల్లి గ్రామంలో, కన్నపువాండ్లపల్లె, రామాపురం టౌన్, పాత రామాపురంలో,హరిజనవాడ ఇంటింటి ప్రచారం నిర్వహించిన రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయిన తనను రాజంపేట పార్లమెంటు NDA కూటమి అభ్యర్థి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా, రాయచోటి పట్టణ ప్రాంతంలో చిన్న సన్నకారి పరిశ్రమల ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, అలాగే తాగునీటి సమస్య తీర్చడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తూ ముందుకు కదలారు.ఈ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు,గ్రామ నాయకులు, తెలుగుదేశం పార్టీ కూటమి కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.