అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా సాగిన జగన్ పాలన…

నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపించా…

రేపటి తరాలకుపయోగపడేలా అభివృద్ధి చేసి చూపిస్తా…

అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్లుగా ఐదేళ్ల జగన్ పాలన కొనసాగిందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు .నామినేషన్ కార్యక్రమ అనంతరం ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి,మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డి లు మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను ఈ రోజు నామినేషన్ ను మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్ పి కో ఆప్షన్ సభ్యుడు అలీ నవాజ్, న్యాయవాది జివి రాఘవ రెడ్డి,తన చిన్నాన్న గడికోట కుమార స్వామి రెడ్డి లతో కలసి రెండు సెట్ల నామినేషన్ వేయడం జరిగిందన్నారు. మనుషులలో రెచ్చగొట్టి, విడగొట్టి రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.ప్రజా స్వామ్య విలువలను తప్పని సరిగా పాటించాలన్నారు.
అభివృద్ధి, సంక్షేమం, శాంతి, ప్రజలకు అందుబాటులో ఉండడం వంటి విషయాలను ప్రతి రాజకీయ నాయకునికి ఉండవలసిన లక్షణాలన్నారు.
అభివృద్ధి విషయంలోజగన్ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని ధైర్యంగా చెపుతామన్నారు.17 మెడికల్ కాలేజీలు,4 పోర్టులు, 10 షిప్పింగ్ హార్బర్లును, పరిశ్రమలను సీఎం జగన్ తీసుకు రావడం జరిగిందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజిజిస్ లో రాష్ట్రం ఏ ర్యాంకులతో ఉంది, అదేరకంగా గ్రామాలలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ భవనాల నిర్మాణాలు , ల్నాడు నేడు తో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధి కళ్ళకు కట్టినట్లుగాకనపడుతోందన్నారు.

రూ.2.70 లక్షల కోట్లను ప్రజల ఖాతాలలో సంక్షేమం క్రింద అందించిన ఘనత సీఎం జగన్ దే…

రూ 2.70 లక్షల కోట్లను ప్రజల ఖాతాలలో సంక్షేమం క్రింద అందించిన ఘనత సీఎం జగన్ దే నన్నారు.అర్హతే ఆధారంగా సంక్షేమ ఫలాలు అందాయన్నారు.ఒక నియోజక వర్గానికే రూ 2300 కోట్ల నిధులు సంక్షేమానికి అందించారన్నారు.ఏ ఇంటికెళ్లి నా ప్రతి ఇంట్లో మూడో నాలుగో పథకాలు అందాయని ప్రజలే సంతోషంగా చెప్పుచున్నారన్నారు.కరోనా సమయంలో కూడా ఎక్కడా సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు.అర్హతే ఆధారంగా సంక్షేమ పథకాలును అందించడం జరిగిందన్నారు.

శాంతికి నిలయం.. రాయచోటి నియోజక వర్గం:
శాంతికి నిలయంగా రాయచోటి నియోజక వర్గంను తీర్చిదిద్దుతున్నామన్నారు.ప్రజలు కూడా శాంతికి అలవాటు పడ్డారన్నారు. న్యాయంగా ఉండాలని, అన్యాయాలు, అక్రమాలు,దౌర్జన్యాలను పూర్తిగా తగ్గించామన్నారు. అక్రమ పంచాయతీలు,భూ కబ్జాలను పూర్తిగా జరగనీయకుండా చేయడం జరిగిందన్నారు.

ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో:
ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నామన్నారు.కరోనా సమయంలో కూడా ప్రజలకు తోడుగా నిలిచామన్నారు. కరోనా ఆసుపత్రుల లోకి వెళ్లి రోగులతో మమేకమం అయ్యామన్నారు. ప్రజలకు ఏ సమయంలో నైనా, అర్ధరాత్రి వేళల్లో కూడా తోడుగా నిలుస్తున్నామన్నారు

మంచి పనులు చేసినందునే ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ సిపి కే ఉంది:

నియోజక వర్గంలో మంచి పనులు చేసి, ప్రజలకు ఎల్లవేళలా తోడుగా నిలిచినందునే ప్రజలను ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ సిపి కే ఉందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. ప్రజలకు మేలు జరిగి ఉంటేనే తమకు అండగా నిలవాలని తమ అధినేత జగన్ చెబుతున్నారన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు హయాంలో చెప్పుకునేందుకు శాశ్విత అభివృద్ధి పథకం ఒక్కటీ లేదన్నారు. వ్యక్తిగత విమర్శలకు తాను చోటివ్వనన్నారు. గడప గడప కు మన ప్రభుత్వం ద్వారా నియోజక వర్గంలో ఒక లక్ష కుటుంబాలను కలిసి ప్రజల కష్ట, సుఖాలలో పాలుపంచుకున్నామన్నారు. గత ఎన్నికలలో చంద్రబాబు ఆరు వందలకు పైగా హామీలిచ్చి, ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోవడమే కాకుండా, మ్యానిఫెస్టో ను సైతం ఆన్ లైన్ లో లేకుండా చేసారన్నారు. అదే జగన్ తన ఐదేళ్ల పాలనలో 99 శాతంకు పైగా హామీలును అమలుచేసిఇంటింటికీ మ్యానిఫెస్టోను పంపించారన్నారు.ఇప్పుడు జగన్ విడుదల చేయనున్న మ్యానిఫెస్టో ను ప్రజలందరూ ఎదురు చూస్తున్నారంటే, జగన్ పై ప్రజలుకున్న నమ్మకమేనన్నారు.

కరోనా కష్టాలలో ప్రజలకు అందుబాటులో లేని వారు ఎన్నికల సమయంలో కనపడుతున్నారు:

కరోనా కష్టాలలో నియోజక వర్గ ప్రజలకు తోడు నీడగా నిలిచామన్నారు. కోవిడ్ ఆసుపత్రులలో సైతం రోగుల దగ్గరికి వెళ్లి వారికి అండగా నిలిచామన్నారు. ఆనందయ్య మందును కూడా ఇంటింటికీ అందచేసామన్నారు. ఆ సమయాలలో అందుబాటులో లేని వారు ఎన్నికల సమయంలో ప్రజలకు కనపడుతున్నారన్నారు. వారెవరినీ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ ఉంది…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్టాండ్ ఉందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రజా స్వామ్య బద్దంగా అన్ని విషయాలలోనూ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదన్నారు. చంద్రబాబు తాను గొప్పలౌకిక వాదినని, మోడీ గొప్ప వీరుడని చంద్రబాబు మాట్లాడుతుంటారని, అయితే ఐదేళ్లు తిరగకముందే చంద్రబాబు మాట మార్చి ఇంకో పార్టీ కి కొమ్ముకాస్తాడన్నారు.

చేసిన అభివృద్ధి పనులును,చేయబోయే అభివృద్ధి పనులను చెప్పుచున్నాం:

రాబోయే తరాలకు గుర్తుండిపోయే విధంగా నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామన్నారు.రాయచోటి పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, ఆర్ టి సి బస్ స్టాండ్ విస్తరణ, మున్సిపల్ సభా భవనం, డైట్ మున్సిపల్ పార్క్, రైతు బజార్, నగర వనం, శిల్పారామం, స్టేడియం, టి టి డి కళ్యాణ మండపం తదితర అభివృద్ధి పనులను చేసి చూపించామన్నారు. వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి పనులకు కేటాయింపులు చేయించామన్నారు.నియోజక వర్గ వ్యాప్తంగా 20 వేల పక్కా గృహాలు, 93 జగనన్న కాలనీలను మంజూరు చేయించి పేదల సొంతింటి కలనునెరవేరుస్తున్నామన్నారు. వెలిగల్లు నీటిని ఆయకట్టు చివరి వరకు అందిస్తున్నామన్నారు.రూ 100 కోట్ల రూపాయల నిధులతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణాలకు టెండర్ ప్రక్రియలో వుందన్నారు. రూ 190 కోట్ల నిధులతో పిజి కేంద్రం ఏర్పాటు తదనంతరం యూనివర్సిటీ గా అభివృద్ధి చేసితీరుతామన్నారు. రహదారుల విస్తరణ, సీసీరోడ్లు నిర్మాణం, పార్క్ ల ఏర్పాటు, ప్రధాన కూడళ్లు సుందరీకరణ, ఎల్ ఈ డి లైట్లు తదితర అభివృద్ధి పనులతో పట్టణ రూపు రేఖలు మార్చామని, నియోజక వర్గంలోని మండల కేంద్రాలను, పలు గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాబోవు రోజుల్లో పట్టణంలోని రింగ్ రోడ్డును నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేస్తామన్నారు.యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

చంద్రబాబు ఏ ఊరికెళితే ఆ ఊరిని జిల్లా కేంద్రం చేస్తానంటున్నారు:
చంద్రబాబు ఏ ఊరికెళితే ఆ ఊరిని జిల్లా కేంద్రం చేస్తానంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కుప్పం ను రెవెన్యూ డివిజన్ ను చేయలేని చంద్రబాబు మదనపల్లె, రాజంపేట లను జిల్లా కేంద్రం లు చేస్తామంటే ఎవరు నమ్ముతారన్నారు.రాయచోటి జిల్లా కేంద్రాన్ని మారుస్తామని చంద్రబాబు చెప్పచుంటే ఈ ప్రాంత టి డి పి నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

టిడిపి కి పరాభవం తప్పదు: మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డి
జరుగుతున్న ఎన్నికలలో టిడిపి కి పరాభవం తప్పదని మాజీ ఎంఎల్ఏ రమేష్ కుమార్ రెడ్డి జోష్యం చెప్పారు. మైనారిటీలును కించపరిచే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసారన్నారు.కూటమితో జతకట్టిన చంద్రబాబుకు ఈ భావజాలం ఉందా స్పష్టం చేయాలన్నారు.పూటకో రకంగా ఊసరవెల్లి మాదిరిగా పొత్తులు పెట్టుకుని రాజకీయం చేసే చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి మాటమీద నిలబడిన జగన్ ను మరోసారి సీఎం ను చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలని రమేష్ కుమార్ రెడ్డి అభ్యర్థించారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *