భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం
సెక్యురిజాన్ని కాపాడుకుందాం
మత విద్వేషాలను వ్యతిరేకిద్దాం
గాంధీ జయంతి సందర్భంగా సిపిఐ ఆందోళన
రాజమహేంద్రవరం అక్టోబర్ 2: జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న భారతదేశాన్ని నేడు పరిపాలిస్తున్న హిందూ మతోన్మాద పాలకులు బడా కార్పొరేట్ వ్యక్తులకు సామ్రాజ్యవాదులకు అమ్మి వేస్తున్నారని కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న విధానాలతో దేశం అట్టడుగు పోతుందని అందుకే భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అన్ని వర్గాల ప్రజలు సిపిఐతో నడవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు సోమవారం జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద ఆయనకు పూలమాలలు వేసి అనంతరం నిరసన ఆందోళన చేపట్టారుఈ సందర్భంగా అక్కినేని వనజ మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు హరించబడుతున్నాయని ప్రజా ఉద్యమాలు ప్రజాసంఘాలపై దాడులు నిర్బంధాలు పెరిగిపోతున్నాయని మానవ హక్కులు హరించబడుతున్నాయని ఆమె అన్నారు నేడు ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడిరది అన్నారు యువతరంలో ఉన్మాదాన్ని ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజల ఆలోచనను మూఢనమ్మకాల వైపు మల్లిస్తుందని అన్నారు మణిపూర్ ఘటనలు , రేజర్ల ఆందోళన పై నోరు మెదపని నరేంద్ర మోడీ సనాతన ధర్మంపై ఉదయ నిది స్టాలిన్ చేసిన వాక్యాలపై మాత్రం ఆగమేఘాల విూద విరుచుకుపడ్డారని అన్నారు వచ్చే ఎన్నికల్లో బిజెపి సనాతన ధర్మం పేరుతో లబ్ధి పొందేందుకు మతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి తరుణంలో గాంధీజీ నడిచిన మార్గం ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు లౌకిక రాజ్యం పటిష్టం కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని మత విద్వేషాలను పక్కన పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో మహిళాసమాక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని , సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు , జట్లు సంగము అధ్యక్షులు కుండ్రపు రాంబాబు , మహిళా సమాఖ్య నేత రాణి , నగర సహాయ కార్యదర్శిలు సప్ప రమణ , సి నౌరుజీ , ఎఐఎస్ ఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్ , ఏఐవైఫ్ జిల్లా కన్వీనర్ శ్రీనువాస్ , వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా ప్రధాన కార్యదర్శి తోట లక్ష్మణ్ , పార్టీ నగర కార్యవర్గ సభ్యులు సెపీని రమణమ్మ , నల్ల రామారావు ,యడ్ల లక్ష్మి , కొండవతి , ఉమ , జి ఎ రామారావు , రామకృష్ణ , భద్రరావు , జట్లసంఘము నాయకులు దేవుడు , అప్పల నాయుడు , వెంకటరావు తదితరులు పాలగున్నారు.