కాకినాడ, ఏప్రిల్‌ 2 :పవన్‌ కళ్యాణ్‌ పొలిటీషియన్‌ కంటే ముందు సూపర్‌ స్టార్‌.ఆయన చుట్టూ ఒక రక్షణ కవచంలా సెక్యూరిటీ ఉంటుంది. ఆయనను కలవడం అంత ఈజీ కాదు. తెలుగు సినిమా రంగంలో నెంబర్‌ వన్‌ స్టార్‌ గా ఉన్నారు. ఆయనకు సినీ గ్లామర్‌ పుష్కలం.ఆయన చుట్టూ ప్రైవేట్‌ సెక్యూరిటీ గట్టిగా ఉంటుంది. కానీ ఇప్పుడు తనపై వైసీపీ అల్లరిమూకలు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని పవన్‌ ఆరోపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిపై వైసీపీ నేతలు కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ కంటే చిరంజీవిని కలవడం చాలా ఈజీ అని.. అటువంటిది ఆయన పై దాడి ప్రయత్నం అభూతకల్పనగా తేల్చేస్తున్నారు. గతంలోనూ పవన్‌ ఇటువంటి ఆరోపణలే చేశారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన జనసేన అధినేతగా ఆయన ఫిర్యాదు చేయవచ్చు కదా?అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.ప్రస్తుతం పవన్‌ తాను పోటీ చేయబోయే పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. తనతో పాటు తన సిబ్బందిపై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి చేసేందుకు ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు సైతం తనపై హత్యకు ప్లాన్‌ జరిగిందని.. సుఫారీ ఇచ్చారని మొన్న ఆ మధ్యన ఆరోపణలు చేశారు. అయితే పవన్‌ గతంలో సైతం లోకేష్‌ పై ఆరోపణలు చేసిన వైనాన్ని వైసిపి గుర్తు చేస్తోంది. గత ఎన్నికలకు ముందు ఓ సందర్భంలో టిడిపి ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని.. లోకేష్‌ తనను టార్గెట్‌ చేసుకున్నారని పవన్‌ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తర్వాత అంశం కనుమరుగు అయ్యింది.ఇప్పుడు అదే లోకేష్‌ తనకు సోదరుడితో సమానమని పవన్‌ చెబుతున్నారు.అప్పట్లో చేసిన ఆరోపణలే.. ఇప్పుడు వైసీపీపై చేస్తుండడం విశేషం.పవన్‌ విూద సన్నని బ్లేడ్లతో దాడులకు తెగబడడానికి ముఠా సిద్దంగా ఉందా? అన్నది హాట్‌ టాపిక్‌ గా మారింది. పవన్‌ ఇష్టపడే వేలాదిమంది అభిమానులు ఎప్పుడూ ఆయన వెంట ఉంటారు. ఒకవేళ ఎవరైనా అటువంటి ఆకతాయి పనిచేసిన తప్పించుకోగలడా అన్నది పెద్ద డౌట్‌. పోలీసులు పట్టుకోలోగా అభిమానులే చుట్టుముడతారు. తగిన శాస్తి చేస్తారు. గతంలో కూడా ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలిసి పవన్‌ జోలికి వచ్చేందుకు ఎవరూ సాహసించరు. ఒకవేళ వైసీపీ ప్రోత్సాహం అందిస్తే ఆ పార్టీకి సైతం మూల్యం తప్పదు. అయితే పవన్‌ వద్ద ఆధారాలు ఉన్నాయా? ఇంటలిజెన్స్‌ నుండి ఏమైనా సంకేతాలు వచ్చాయా? ఉత్త మాటగానే ఆయన అనరు కదా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా పవన్‌ పై ఇటువంటి దాడి ప్రయత్నాలు చేసినా వారికి ట్రబుల్స్‌ తప్పవు.అయితే ప్రత్యర్థులు ఇటువంటి దాడులకు ప్రయత్నాలు చేస్తుంటే పవన్‌ సీరియస్‌ గా తీసుకోవాలి. తన వద్ద ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలకు ఫిర్యాదు చేయాలి. భద్రత పెంచాలని కోరాలి. ఇటీవల లోకేష్‌ కు ఇటువంటి పరిణామాలే ఎదురు కావడంతో కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను కల్పించింది. పవన్‌ సైతం అటువంటి భద్రతను కోరుకోవాలి. తనపై దాడికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నా కేంద్ర నిఘా సంస్థలకు నివేదించాలి. కానీ పవన్‌ ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలే చేయడం.. ఇప్పుడు కూడా వాటిని కొనసాగిస్తుండడంతో ఆయన పైనే ఒక రకమైన అనుమానపు చూపులు ప్రారంభమయ్యాయి. అందుకే తనపై దాడికి ప్రయత్నించే వారి విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఫిర్యాదు చేస్తే చాలా మంచిది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *