👉 అన్నమయ్య వరద బాధితుల సంగతేంటి
👉 జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని తేదేపా డిమాండ్
రాజంపేట పట్టణం/పార్లమెంట్ క్యాంప్ కార్యాలయం,రాజంపేట
✍ ఒకటో తారీఖున అవ్వా తాతలకు ఇవ్వాల్సిన పింఛన్ సొమ్ములతోపాటు ఆరోగ్య శ్రీ కీ ఇవ్వాల్సిన నిధులు 13 వేల కోట్లు మార్చి 16 నుంచి 30వ తారీకు లోపల అంటే 15 రోజుల్లోనే జగన్ రెడ్డి తన అనుకూల కాంట్రాక్టర్లకు మొత్తం దోచిపెట్టేశారని, దీంతో పింఛన్ల సొమ్ము ఇవ్వడానికి నేడు ఖజానాలో సరిపడా నిధులు లేవని నేడు తన క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.
✍ అంతేకాకుండా సచివాలయ సిబ్బంది,గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధులకొరతే కానీ ఎన్నికల కమిషన్ మరియు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అడ్డు తగలడం లేదని
✍ వైసిపి ప్రభుత్వం,జగన్ రెడ్డి స్వార్థ రాజకీయం వల్ల పింఛన్ దారులు,వాలంటీర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు
✍ అదేవిధంగా ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదని ఆయన ప్రశ్నించారు..?ఖజానాలో నిధులు లేకనే కదా..?
✍ తద్వారా 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ధప్రాతిపదికన పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేయడం సాధ్యమని,టిడిపి అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకు 4000 రూపాయల పింఛను అందిస్తుందని చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.
✍ వాలంటీర్లును ప్రజాసేవ కార్యక్రమాలకు కాకుండా వైకాపా ప్రభుత్వం వారిని వైకాపా కార్యక్రమాలకు వాడుకుంటూ అధికార దుర్వినియోగం చేశాడని, తద్వారా వాలంటీర్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘించే విధంగా చేసి వందల మందిని సస్పెన్షన్ గురవుతూ క్రిమినల్ కేసులు నమోదుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారుకులయ్యారన్నారు.
👉 జగన్ రెడ్డి ఏమ్ సాధించావని జిల్లాకు వస్తున్నావ్..?
✍ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ద్వారా మరోసారి జిల్లాకు వస్తున్నారని ఏం సాధించారని,ఏమ్ మొహం పెట్టుకుని జిల్లాలో తిరగడానికి వస్తున్నావో సమాధానం చెప్పాలని జగన్ మోహన్ రాజు ప్రశ్నించారు.
✍ అన్నమయ్య ప్రాజెక్టు తెగి రెండు సంవత్సరాలు గడుస్తున్న స్వయంగా ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి వరద బాధితులకు స్వయంగా ప్రభుత్వమే పక్కా గృహాలు నిర్మించి ఇస్తానన్న హామీ ఏమైందో చెప్పాలన్నారు.
✍ జిల్లాకి రైల్వే లైన్ లేదని,ఒంటిమిట్ట ఎత్తిపోతల పథకం ద్వారా కనీసం చెరువుకు నీటిని కూడా విడుదల చేయలేదన్నారు.
✍ అంతేకాకుండా గడచిన ఐదు సంవత్సరాలు రోడ్లపై గుంతలపై తట్టెడు మట్టి వేయలేదన్నారు
✍ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తోపాటు ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయాన్ని కడతానని చెప్పిన జగన్ రెడ్డి నేడు రాష్ట్రంలో ఒకటైన ఏర్పాటు చేశావాని ఆయన ప్రశ్నించారు
🔸 ఈకార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు,మండల పార్టీ ఉపాధ్యక్షులు సతీష్ రాజు, సీనియర్ నాయకులు జి.వి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *