రాయచోటి: కేంద్రంలో బిజెపి పదేళ్ల పాలనలో 50 ఏళ్ల అభివృద్ధి వెనక్కి వెళ్ళిందని , రాష్ట్రంలో వైసిపి ఐదేళ్ల పాలనలో 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ పేర్కొన్నారు, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పది సంవత్సరాలు ప్రత్యేక హోదా గ్యారెంటీ. అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా అమలు కాంగ్రెస్ చేస్తుందని అన్నారు. ప్రతి పేద మహిళలకు ప్రతినెల రూ. 8500/- లు ఇస్తాం. ఏడాదికి లక్ష రూపాయలు ఇది మహిళలకు భరోసా ఇచ్చే పథకం అని ఆయన చెప్పారు. రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ ఉంటుందని ఆయన అన్నారు, అలాగే పెట్టుబడి మీద 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర ఉంటుందన్నారు. శనివారం తమ పార్టీ కార్యాలయంలో
ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం రూ. 400 లు, విద్యార్థులకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.20 లక్షలు ఉద్యోగాలు భర్తీ పై రాహుల్ గాంధీ మొట్ట మొదటి సంతకం ఉద్యోగాల మీదే ఉంటుందన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్, అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.4000 లు పెన్షన్, వికలాంగులకు 6000 పెన్షన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర కోసం వైయస్ షర్మిలా రెడ్డిని ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలకు చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.