28 సంవత్సరాల పాటు ఇరిగేషన్ శాఖలో పనిచేసిన రోశయ్య
నాలుగు సంవత్సరాల సర్వీసు ఉండగానే రాజీనామా
బద్వేలు: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం (రిజర్వు) తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కరారైన బొజ్జ రోశయ్య తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు ఆయన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది రాజీనామా ఆమోదం పొందిన విషయాన్ని రోశయ్య కూడా ఖరారు చేశారు బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ళకు చెందిన రోశయ్య బద్వేలు తెలుగుదేశం అభ్యర్థిగా పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఇప్పటికే నర్మగర్భంగా ప్రకటించారు పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్లడంతో రోశయ్య అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించలేదు రోశయ్య మొదటినుంచి ఆయన ఆయన కుటుంబం తెలుగుదేశం పార్టీ అభిమానులు మాజీ మంత్రి దివంగత వీరారెడ్డి తో మంచి సంబంధాలు ఉన్నాయి రోజయ్య ఉద్యోగరీత్యా ప్రస్తుతం నీటిపారుదల శాఖలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో డి ఈ గా పనిచేస్తున్నారు 28 సంవత్సరాలుగా ఆయన నీటిపారుదల శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు నాలుగు సంవత్సరాల సర్వీసు ఉండగానే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు త్వరలో బద్వేల్ కు వచ్చి పార్టీ నాయకులను కార్యకర్తలను కలుస్తానని రోశయ్య ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.
