విజయవాడ: వైసీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి డానికి త్రివేణి సంగమం కలయిక అంటే మూడు పార్టీలు అవిరళ కృషి చేయాలని బీజేపీ ఏపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు. జనసేన తో పొత్తు లో ఉన్నాం. టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరం. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమం. ఏపీలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశా వహులకు నిరాశ ఎదురైంది. కానీ రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని పార్టీ హైకమాండ్‌ భావించింది. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుంది. భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారు. అప్పులు భారీ ఎత్తున చేసేసింది ఈ ప్రభుత్వం. సెక్రటేరీయేట్టును, గనులను, ప్రభుత్వ భవనాలను, భూములను తనఖా పెట్టేశారని అన్నారు. సెక్రటేరీయేట్టును తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశారా అని ఓ వైసీపీ నేత కామెంట్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే. మహిళల పుస్తెలు తెగినా నాసిరకం మద్యం తాగిస్తామనే రీతిలోనే జగన్‌ వ్యవహరిస్తున్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలనే సీఎం జగన్‌.. ఆ వర్గాలకు ఏం న్యాయం చేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల నిధులు దారి మళ్లించారు. ఎస్సీ యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీని సీఎం తన పక్కన కూర్చొబెట్టుకుంటున్నారు. ఎస్సీలకు జగన్‌ చేసిన న్యాయం ఇదేనా..? ఏపీ అభివృద్ధికి బీజేపీ అంకితమై పని చేస్తుంది. వైసీపీ నిరంకుశ పాలన చూస్తున్నాం. సీఎం జగన్ను గద్దె దించాలంటే మూడు పార్టీల కూటమి.. త్రివేణి సంగమం అనివార్యమని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *