హుజురాబాద్‌: హుజురాబాద్‌ నియోజకవర్గం ఉప్పల్‌ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త స్వర్గం రవి ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి తన రాజీనామా లేఖను పంపించినారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌ ను వీడి భారత రాష్ట్ర సమితిలో చేరిన స్వర్గం రవి ఎలాంటి పదవిని ఆశించకుండా బీ ఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగినారు. కాంగ్రెస్‌ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన స్వర్గం రవి టిపిసిసి ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా గతంలో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కోసం చాలా పని చేసినారు. సేవా దృక్పథం కలిగిన స్వర్గం రవి నియోజకవర్గంలో కష్టకాలంలో ఎంతోమందికి ఆర్థిక సహాయం అందించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. రాజకీయాలలో ఏది ఆశించకుండా నిస్వార్ధంగా పనిచేసే వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌, దుద్దిల్ల శ్రీధర్‌ బాబు గారికి అత్యంత సన్నిహితుడుగా ఉండి గ్రామస్థాయి కాంగ్రెస్‌ నాయకుల నుండి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వరకు సంబంధాలు కలిగిన స్వర్గం రవిని కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని అందరూ కోరుతున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుండి శాసనసభ్యునిగా పోటీ చేసే అవకాశం వచ్చిన రెండుసార్లు సున్నితంగా తిరస్కరించినారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితికి స్థానం లేదని కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. అతి త్వరలోనే నియోజకవర్గంలోని తన అనుచరులను ముఖ్య నాయకులతో సమాలోచన చేసి భారీ ఎత్తున కాంగ్రెస్‌ పార్టీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *