హైదరాబాద్‌, మార్చి 23: ఇంటర్‌ పోల్‌ అలెర్ట్‌… డ్రగ్స్‌ అధికారులు యాక్షన్‌ కట్‌ చేస్తే.. పదేళ్ల గుట్టురట్టు. ఏం జరిగింది? దాడుల్లో ఏం తేలిందని చూస్తే నగరంలో ఏళ్లుగా పాతుకుపోయిన కంపెనీ డ్రగ్‌ గుట్టు బయటపడిరది. అది నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుసు. నిషేధిత డ్రగ్‌ తయారు చేస్తున్న సిఎస్‌ఎన్‌ మెడికేర్‌ పదేళ్లుగా హైదరాబాద్‌ నుంచి యూరోపియన్‌ కంట్రీస్‌కు ఎగుమతి చేస్తున్నట్లు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల దాడుల్లో బయటపడిరది. ఏకంగా 90కిలోల మెఫిడ్రిన్‌ డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. మార్కెట్లో దీని విలువ తొమ్మిది కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు.వాడకం, తయారీ, ఎగుమతికి అనుమతి లేదని తెలుసు. మోతాదు మించితే ప్రాణానికే ప్రమాదం అనీ తెలుసు. అయినా గుట్టుచప్పుడు కాకుండా తయారీ చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తోంది కంపనీ. ఇంటర్‌పోల్‌ ఇచ్చిన సమాచారంతో చెక్‌ పెట్టారు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు..ఐడీఏ బొల్లారంలో ఉన్న ఖూఔ మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భయంకర విషయాలు వెలుగుచూశాయి. కొన్నేళ్లుగా సంస్థ నుంచి విదేశాలకు భారీ మొత్తంలో డ్రగ్స్‌ ఎగుమతి అవుతున్నట్లు తేల్చారు. విదేశాల్లో భారీ డిమాండ్‌ ఉన్న మెఫీడ్రిన్‌ డ్రగ్‌ తయారీని అధికారులు గుర్తించారు. మెపిడ్రిన్‌ 2`ఎంఎంసి, 3 ఎంఎంసి పౌడర్‌ను సీజ్‌ చేశారు. వాస్తవానికి డ్రగ్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధిత సైకియాట్రిక్‌ పదార్థాల జాబితాలో పెట్టింది. నిషేధిత డ్రగ్‌ అని తెలిసినా సిఎస్‌ఎన్‌ మెడికేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వాటిని తయారుచేసి యూరప్‌ దేశానికి ఎగుమతి చేస్తుంది.యూరప్‌ కంట్రీస్‌లో ఈ డ్రగ్‌కు డిమాండ్‌ ఎక్కువ. మెపిడ్రిన్‌ను వివిధ పద్ధతుల్లో శరీరంలోకి ఎక్కించవచ్చు. ఇంజిక్షన్‌ రూపంలోనూ తీసుకోవచ్చు, పౌడర్‌ను సిగరెట్‌ పేపర్లో ఎక్కించి పీల్చుకోవచ్చు. బాడీని స్పీడ్‌గా అలర్ట్‌ చేసే సామర్థ్యం ఈ డ్రగ్‌కు ఉంది. అయితే మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం ప్రాణానికే ప్రమాదం. ఈ డ్రగ్‌ ప్రమాదకర స్థితిని గుర్తించిన కేంద్రం అందుకే నిషేధిత జాబితాలో ఉంచింది. అదే సమయంలో ఈ డ్రగ్‌ను తయారీ, ఇతర దేశాలకు ఎగుమతి కూడా చట్టరీత్యా నేరం. అన్నీ తెలిసినా ఖూఔ మెడికేర్‌ పదేళ్లుగా డ్రగ్‌ తయారుచేస్తోంది.యుకేకి చెందిన కొందరు వ్యక్తులు అధిక మొత్తంలో ఈ డ్రగ్‌ వాడటంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. విదేశాలకు అధిక మొత్తంలో ఎగుమతి అవుతున్న డ్రగ్‌ గురించి ఇంటర్‌పోల్‌ అధికారులు శోధించడంతో గుట్టు మొత్తం బయటపడిరది. సంస్థ నడుపుతున్న డైరెక్టర్‌ కస్తూరి రెడ్డిని డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *