విజయవాడ, అక్టోబరు 1: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిటీషన్‌ పై సుప్రీంకోర్టులో వచ్చే నెల 3వ తేదీన విచారణ జరగనుంది. అయితే ఈ విచరణ చేపట్టే ధర్మాసనం ఖరారయింది. జస్టిస్‌ బేలా త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు పిటీషన్‌ విచారణకు రానుంది. చీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ నెల 3వ తేదీకి విచారణను వాయిదా వేసిన నేపథ్యంలో మరొక బెంచ్‌ కు మారుస్తానని తెలియజేశారు. క్వాష్‌ పిటీషన్‌ ను… ఈ నేపథ్యంలోనే చంద్రబాబు క్వాష్‌ పిటీషన్‌ ఈ నెల 3న జస్టిస్‌ బేలా త్రివేదీ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి తనపై నమోదయిన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలంటూ చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటీషన్‌ ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన తరుపున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరో వైపు
త్వరలో చంద్రబాబు పిటిషన్‌ మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉండగా ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. చంద్రబాబు పిటిషన్‌పై తీర్పు ఇచ్చే ముందు తమ తరపు వాదనలు కూడా వినాలని పిటిషన్‌ లో ప్రస్తావించింది. స్కిల్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయని తెలిపింది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారని? నిధులను షెల్‌ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్‌ చేసుకున్నారని పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయని? ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీనే అని చెప్పింది. ఈ కేసులో తమ తరపున వాదనలను వినిపిస్తామని కేవియట్‌ పిటిషన్‌ లో సుప్రీంకోర్టును కోరింది.స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్‌ఎల్పీ పిటిషన్‌ బుధవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అయితే ఈ బెంచ్‌లో తెలుగు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి కేసు విచారణకు విముఖత వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని చంద్రబాబు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా సీజేఐ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *