విజయవాడ, మార్చి 20 : ఏపీలో ఎన్నికల పోరు మొదలైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీతో పోటీ పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ సభలు, నాయకుల ఆరోపణలు ` ప్రత్యారోపణలతో ఆ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా ప్రచార పర్వం రణరంగాన్ని తలపించేలా సాగుతున్నాయి. ఏపీలోని రాజకీయ రణరంగం వెండితెరకూ పాకింది. వైసీపీకి మద్దతుగా మహి వి రాఘవ్ ‘యాత్ర 2’, రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు తీశారు. వైసీపీకి వ్యతిరేకంగా ‘రాజధాని ఫైల్స్’ వచ్చింది. ఇప్పుడు మరో సినిమా, వైఎస్ వివేకానంద రెడ్డి బయోపిక్ ‘వివేకం’ రాబోతోంది. మార్చి 22న యూట్యూబ్ / వెబ్సైట్లో ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ విూడియాను ట్రైలర్ షేక్ చేస్తోంది.వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. తొలుత గుండెపోటుతో మరణించారని వెల్లడిరచారు. ఆ తర్వాత గొడ్డలి పోటుకు ప్రాణం పోయిందని స్పష్టమైంది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్, సీబీఐకి అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ‘వివేకం’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ప్రారంభంలో పేర్కొన్నారు. ‘మేం కొత్త పార్టీ పెట్టాలని అనుకుంటున్నాం… నాయన పేరు విూద’ అని ‘వివేకం’ ట్రైలర్ ప్రారంభంలో డైలాగ్ వినిపించింది. వైఎస్ జగన్ పాత్రధారి డైలాగ్ అన్నమాట. ఆ తర్వాత ‘విూ నాయనకు, నాకు రాజకీయ భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ’ అని వివేకా స్పష్టం చేస్తారు. ‘పార్టీలోకి రాకపోతే మేమే నీకు ఎదురు నిలబడాల్సి వస్తుంది’ అని వివేకాకు విజయమ్మ ఎదురు నిలబడటం, ఆ తర్వాత తన కుమారుడికి మద్దతు ఇవ్వమని కోరడం వంటివి చూపించారు. వివేకా హత్యకు గురైన తర్వాత జగన్ ప్రెస్ విూట్ కూడా చూపించారు. వివేకా హత్యకు ఏ విధంగా ప్రణాళిక వేశారు? ఆ తర్వాత ఏమైంది? వంటి విషయాల్ని ప్రధానాంశంగా తీసుకుని సినిమా చేసినట్లు సులభంగా చెప్పవచ్చు.