విశాఖపట్నం:నన్ను విశాఖ ఎంపీగా గెలిపిస్తే దేశాన్ని కాపాడతానని ప్రజాశాంతి పార్టీ అధ్య క్షుడు కేఏ పాల్ అన్నారు.దేశాన్ని కాపా డటానికి గత 7 సంవత్సరాలుగా ప్రయ త్నిస్తు న్నానని తెలిపారు.ఎస్. కోట ఎమ్మెల్యే గా, విశాఖ ఎంపీగా తాను పోటీ చేస్తానని ప్రకటించారు. సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముగ్గురు మోదీ తొత్తులేనని ఎద్దేవా చేశారు. జగన్ను మళ్లీ గెలిస్తే మోదీకే మద్దతు పలుకుతారని అన్నారు. మోదీకి జగన్ దత్తపుత్రుడని అన్నారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ 500 కోట్ల విలువైన క్రిస్టియన్ ఛారిటీ స్థలాన్ని దోచుకున్నారని మండిపడ్డారు.