వైయస్సార్‌ ఈబీసీ నేస్తం రూ. 629.37 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం జగన్‌
మేనిఫెస్టో తీసుకొని నేరుగా విూ ఇంటికి వస్తాం.. మంచి జరిగితేనే టిక్‌ కొట్టండి
బాబుకు, పవన్‌ కు విశ్వనీయత, విలువులు లేవు,
ముగ్గురు కూటమిగా ఏర్పడి, పేదవాడి భవిష్యత్తుపై దాడికి వస్తున్నారు
రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 629.37 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్‌ నొక్కి సీఎం జగన్‌ నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగించారు.
’’ఆర్థికంగా వెనుకబడిన ఓసీ అక్కచెల్లెమ్మలు, వారి కుటుంబాలకు కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్సార్‌ ఈబీసీ నేస్తం అనే ఈ పథకంతో 45`60 సంవత్సరాల వయసులో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరికీ రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమ, బ్రాహ్మణ.. తదితర ఓసీల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు కూడా ఆర్థిక స్వావలంబన కలిగిస్తూ ఏటా రూ.15,000 చొప్పున వరుసగా చేయి పట్టుకుని నడిపిస్తూ మూడేళ్లపాటు సహాయం అందించే కార్యక్రమంమే ఈ వైయస్సార్‌ ఈబీసీ నేస్తం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

I4,19,583 చెల్లెమ్మలకు వైయస్సార్‌ ఈబీసీ నేస్తం రూ. 629.37 కోట్ల నిధులు విడుదల చే

వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4,19,528 మంది నా అక్కచెల్లెమ్మలకు 629 కోట్లు వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నామని, ఈ రోజు జమ చేస్తున్న ఈ సొమ్ముతో కలుపుకొంటే మూడు దఫాల్లో 4,95,269 మంది అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ రూ.1877 కోట్లు వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా మంచి చేయగలిగామని,. ఈబీసీ నేస్తం పథకంలో కొత్తగా ఆర్థిక సాయం అందుకుంటున్న అక్కచెల్లెమ్మలు 65618 మంది అయితే, 107824 మంది నా అక్కచెల్లెమ్మలు ఇదే ఈబీసీ నేస్తం రెండు సార్లు పొందారని, 3,21,827 మంది అక్కచెల్లెమ్మలు మొత్తంగా మూడు సార్లు వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి అందుకున్నారని సీఎం తెలిపారు.

అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఒక చేయూత ద్వారానే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు దాదాపుగా 33,14,000 మందికి మంచి జరిగిస్తూ అడుగులు పడ్డాయని, వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా 4,64,000 మందికి మంచి జరిగిందని, వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,000 మందికి మంచి జరిగించామని, మొత్తంగా 45`60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న అక్కచెల్లెమ్మలు 44,74,000 మందికి మంచి జరిగిస్తూ ఈ 58 నెలల కాలంలో అడుగులు పడ్డాయని సీఎం వివరించారు .

సంక్షేమ పథకాల్లో సింహ భాగం నా అక్కచెల్లెమ్మల పేరువిూదే

అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌ గానీ, అమ్మ ఒడి, వైయస్సార్‌ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఇళ్ల పట్టాలపంపిణీ, అక్కచెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్‌, ఇళ్లు కట్టించే కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇవన్నీ కూడా నా అక్కచెల్లెమ్మలు బాగుండాలని, కుటుంబాలు బాగుండాలని ఎక్కడా కూడా కులం చూడటం లేదు, వర్గం, మతం, ప్రాంతం, చివరకు ఏ పార్టీకి ఓటు వేశారనేది కూడా చూడటం లేదని సీఎం స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల్లో సింహ భాగం నా అక్కచెల్లెమ్మల పేరువిూదే, వారి చేతికే అందిస్తున్న ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా జరిగిస్తున్నది కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని సీఎం అన్నారు.

మేనిఫెస్టో తీసుకొని నేరుగా విూ ఇంటికి, మంచి జరిగితేనే టిక్కు కొట్టండి

ఇలా ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ జరగని, చూడని విధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో వేశామని, ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడిన పరిస్థితులు ఇప్పుడే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో రూ.1.89 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మలకే నేరుగా వారి ఖాతాల్లోకి వెళ్లియని చెప్పారు. మహిళా సాధికారత పరంగా ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌ చేసి, అందులో ఏదైతే హావిూలిచ్చామో ఆ హావిూలన్నీ ఒక భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ గా భావిస్తూ ఏకంగా 99 శాతం హావిూలను అమలు చేసి ఈరోజు ఆ మేనిఫెస్టో తీసుకొని నేరుగా విూ ఇంటికి వచ్చి మన ప్రజా ప్రతినిధులు విూరే చూడండని, చెప్పిన ప్రతి ఒక్కటీ జగనన్న చేసి చూపించాడని, విూరే టిక్కు పెట్టండని ధైర్యంగా విూ ఇంటి గడప తొక్క గలిగిన పరిస్థితి ఒక్క వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మాత్రమే ఉంది. మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు ప్రజల్ని మోసం చేయడం, రంగురంగుల హావిూలివ్వడం, వచ్చిన తర్వాత చెత్తబుట్టలో వేయడం అనే సంప్రదాయాన్ని మారుస్తూ ఒక బైబిల్‌, భగవద్గీత, ఖురాన్‌ గా భావించిన పరిస్థితి కేవలం విూ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరిగిందని సీఎం ఉద్ఘాటించారు.

చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తొచ్చేది బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి.

పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది.
I ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచీ గుర్తుకురాదు. ఒక్క స్కీము కూడా గుర్తుకురాని పరిస్థితి.
I దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థను భ్రస్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు.
I 5 సంవత్సరాలకోసారి కార్లు మార్చినట్లుగా భార్యలను మార్చే ఒక మ్యారేజీ స్టార్‌, ఓ వంచకుడు గుర్తుకొస్తాడు.

I ఒకరికి విశ్వసనీయత లేదు. మరొకరికి విలువలు లేవు. వీరు మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి ఈరోజు విూ బిడ్డ విూదకు యుద్ధానికి వస్తున్నారు.. కాదు కాదు.. మూడు పార్టీలుగా కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్‌ విూద యుద్ధానికి వస్తున్నారు.
I ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు, ఇదే పవన్‌ కల్యాణ్‌, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెబుతున్న మోసపూరిత వాగ్దానాలు ఇదే మాదిరిగేనే స్టేజీ విూద కూర్చొని ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చారు.
I చంద్రబాబు సంతకం పెట్టి మరీ ప్రతి ఇంటికీ పంపించాడు.
I ఇందులో ఈయన రాసిన మాటలు, వాగ్దానాలు.. రైతులకు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు.
I 87612 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని ఎగనామం పెట్టాడు.
I పొదుపు సంఘాల రుణాలు 14205 కోట్లు మాఫీ చేస్తానని, నా అక్కచెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు.
I మహిళా రక్షణకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ కథ దేవుడెరుగు.. విజయవాడలో ఏకంగా కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ నడిపించారు.

I ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద రూ.25 వేలు ఖాతాల్లోకి వేస్తానన్నారు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఆడపిల్ల పుట్టినప్పుడు విూకుగానీ, విూకు తెలిసిన వారికిగానీ ఒక్కరికైనా రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లోకి డిపాజిట్‌ చేశాడా అని అడుగుతున్నా. . ఓటు అనే ఒకే ఒక్క దివ్యాస్త్రంతో మాత్రమే చేయగలుగుతామని గట్టిగా చెప్పండి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *