భీమవరం: పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్పందించారు. 24 సీట్లకు పరిమితం అయ్యి చంద్రబాబు మోచేతి నీళ్ళు పవన్ కళ్యాణ్ తాగేందుకు సిద్ధం అయ్యారు. 24సీట్లకు ఒప్పుకుని ఇపుడు 21సీట్లు అంటున్నారు. సొంత అన్నయ్యతో విభేదించా అంటున్నారు.. చిరంజీవి కి పవన్ కు పోలిక ఎంటని అన్నారు. ప్రజారాజ్యం కు 18సీట్లు, 80లక్షల ఓట్లు వచ్చాయి.. చిరంజీవి చాలా సౌమ్యుడు. మరో అన్న నాగబాబుకి పవన్ కళ్యాణ్ అన్యాయం చేశారు. పవన్ కల్యాణ్ ను మంచి మానసిక వైద్యుడికి, ఎర్రగడ్డ ఆసుపత్రిలో చూపించాలని అనే అనుమానం వస్తుంది. వ్యాధి ముదిరితే ప్రాణాంతకం అవుతుంది. పవన్ కామెంట్స్ చూస్తుంటే గురివింద గింజ సామెత గుర్తుకు వస్తుంది. ప్రజా రాజ్యం పార్టీ నాటి నుంచి పవన్ భాష ఏ రకంగా ఉందో అందరికీ తెలుసు. ఇల్లు కొనడానికి వస్తె నేను అడ్డుకున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ వస్తె నాకు ఉన్న 9 ఏకరాల్లో ఎంత కావాలంటే అంత ఇస్తా. భీమవరం వచ్చి ప్రజలు నీ గురించి ఏవిూ అనుకుంటున్నారో ఒక్కసారి పవన్ తెలుసుకోవాలి. నీ అభిమానులకు సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు.. అందుకే నీ నిజ స్వరూపం ఎవ్వరికీ తెలియడం లేదు. పోటీ చేసిన తర్వాత భీమవరం మొహం మళ్ళీ చూడలేదు. కోవిడ్ సమయంలో ప్రజలు ఎం అయిపోయారు అనేది కూడా చూడలేదు. ఉసరవెల్లి లాంటి వ్యక్తి పులపర్తి రామాంజనేయులు.. ప్రజల తాగునీటి పేరుతో 50ఏకరాల భూములు దోచేసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే పులపర్తి. డంపింగ్ యార్డ్ కోసం ఇప్పటికే స్థలం కేటాయించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే పై ఎస్యసీ, ఎస్టీ బి కేసులు ఒక్కటి కూడా లేదు. రౌడీఇజం చేస్తున్న అంటున్నారు .. నా పై ఒక్క క్రిమినల్ కేసు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.