మదరస లో . టిడిపి నేతలు ప్రత్యేక ప్రార్థనలు
ఎమ్మిగనూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని, చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని టిడిపి నేతలు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నేతలు, టిడిపి నేతలు శనివారం ఎమ్మిగనూరు పట్టణంలోని మైనార్టీ కాలనీలో ‘‘దరూల్‌ ఉ లూమ్‌ హన్ఫియా మదరస’’ లో చంద్రబాబు నాయుడు విడుదల కావాలని కోరుతూ మత గురువులతో కలిసి (దువా) ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తరువాత విూడియాతో మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా ప్రజాధనాన్ని లక్షల కోట్లు దోచుకున్న జగన్‌ పదేళ్లుగా బెయిల్‌ పై తిరుగుతుంటే.. అభివృద్ధికి చిరునామా అయిన మచ్చలేని నాయకుడు చంద్రబాబు మాత్రం తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో జైలులో మగ్గుతున్నారని ఆవేదన చెందారు. వైయస్సార్సీపి నాలుగున్నర ఏళ్ల పాలనలో… ముస్లిం మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని, ఆత్మహత్యలు, వేధింపులకు గురి అయిన ముస్లిం మైనార్టీ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్న కోసం తమ పోరాటం ఆగదని, చంద్రబాబుపై జగన్‌ చేసే కుట్రలు కుయుక్తులు ఎన్ని రోజులు సాగవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో… టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్‌ బోర్డు డైరెక్టర్‌ జి. అల్తాఫ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్‌ మాజీ డైరెక్టర్‌ ఉప్పర ఆంజనేయులు, ఎమ్మిగనూరు మండలం మాజీ ఆత్మ చైర్మన్‌ కందనాతి శ్రీనివాసులు, టిడిపి ఎస్సీ సెల్‌ నాయకులు రోజా ఆర్ట్స్‌ ఉసేని, దర్జీ మోషన్న, ఎమ్మిగనూరు మండలం టిడిపి నాయకులు కె. తిమ్మాపురం కురుమన్న, మాసుమాను దొడ్డి బోయ శ్రీనివాసులు, టిడిపి ముస్లిం మైనార్టీ నాయకులు కె.యం.డి. అబ్దుల్‌ జబ్బర్‌, మదిరే పీర్‌ భాష, గోరా బాషా, మేటీ వలి భాష, ఆఫ్గాన్‌ వలి భాష, కడివెళ్ల బడే సాబ్‌, మహబూబ్‌ బాషా, జోహార్‌ అబ్బాస్‌, హాజీ జుల్లా, ముత్వల్‌ సాబ్‌, ఆఫ్గా నవాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *