బద్వేలు: నియంత ప్రభుత్వానికి ప్రజలకు మధ్య యుద్ధం మొదలైంది ఎటువంటి అవినీతి మచ్చలేని చంద్రబాబును జైల్లో పెట్టారు. ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా సిఐడి చూపలేదు వైకాపా ఆరిపోతున్న దీపం. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలను నాశనం చేశారు చంద్రబాబుపై పెడుతున్న కేసులన్నీ కుట్రపూరితమే అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబుకు పేరు ఉంది ఆ పేరు చెడగొట్టడానికి జగన్మోహన్‌ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని కడప పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆదిలక్ష్మి అన్నారు. శనివారం బద్వేల్‌ లో చేపట్టిన తెలుగుదేశం పార్టీ దీక్షలు కొనసాగాయి. జగన్మోహన్‌ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి వ్యవస్థలన్నీ మేనేజ్‌ చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. 43 వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిన జగన్మోహన్‌ రెడ్డిని ఏమి అనాలో తెలియడం లేదన్నారు. గత పది సంవత్సరాలుగా బెయిల్‌ పై ఉన్న జగన్మోహన్‌ రెడ్డి లాంటి అవినీతిపరుడు దేశంలో ఎక్కడ లేడన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తానని చెప్పి , గ్రామ గ్రామాన ఇప్పుడు బెల్ట్‌ షాపులు ఉన్నాయని ఆమె దుయ్యబట్టారు. మహిళల పుస్తెలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిరదన్నారు. గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే స్థానాలు వైకాపాకు వచ్చాయంటే కేవలం దొంగ ఓట్లు కారణమన్నారు. సొంత బాబాయ్‌ వివేకానంద రెడ్డిని హత్య చేస్తే ఈ హత్య చేసిన వారు ప్రపంచమంతా తెలిసిన జగన్మోహన్‌ రెడ్డికి తెలియక పోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నారు. కడప జిల్లా మొత్తం హత్య చేసిన వారు ఎవరో పూసగించినట్లు చెబుతున్నారని ఆమె అన్నారు. ఒక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్‌ రెడ్డి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని ఆమె ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కు లేకుంటే మూడు రాజధానులు నిర్మిస్తానని చెప్పడం హాస్య స్పదంగా ఉందన్నారు. దీక్షలో బద్వేలు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రంతు సర్పంచ్‌ పుల్లారెడ్డి, కలసపాడు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్‌ జర్నలిస్టు కెపిఎం భాస్కర్‌, కెవి సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌ బిజీ వేముల రామ సుబ్బారెడ్డి,స్వామి గోపవరం మండల ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ ఎల్లారెడ్డి దశరథ రామిరెడ్డి, రామ సుబ్బయ్య పెద్ద ఎత్తున కలసపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *