క్రీడల్లో కూడా రాజకీయమా శాడిస్ట్ జగన్..
నెల్లూరులో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి ఫైర్
నెల్లూరు:క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని పెంచాల్సిన ప్రభుత్వం.. అందులో కూడా రాజకీయం చేస్తుందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల అహం, తల పొగరు క్రీడాకారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో ఆయన విూడియాతో మాట్లాడారు. క్రికెట్లో ఎంతో ప్రతిభ కనబరుస్తున్న హనుమ విహారి.. వైసీపీ నేతల రాజకీయానికి బలయ్యారని.. సొంత రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేత కుమారుడిని మందలించారనే ఆరోపణలతో విహారిని పంజి కెప్టెన్సీ బాధ్యత నుంచి తొలగించే కుట్ర చేశారని మండిపడ్డారు. విహారి తప్పేవిూ లేదని టీం సభ్యులు చెబుతున్నప్పటికీ… వైసీపీ నేతలు శాడిజం చేసి అతని తీవ్రంగా ఇబ్బంది పెట్టారని కోటంరెడ్డి ఆరోపించారు.. రాజారెడ్డి రాజ్యాంగాన్ని వైసీపీ నేతలు క్రీడల్లో కూడా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. క్రీడల్ని క్రీడలుగా మాత్రమే చూడాలని కనీస పరిజ్ఞానం సీఎం జగన్కు లేదని దుయ్యబట్టారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలను పక్క రాష్ట్రాలకు తరిమేసే సీఎం జగన్.. ప్రతిభ కలిగిన క్రీడాకారులను కూడా సీఎం వబ జగన్ పక్క రాష్ట్రాలకి తరిమేస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం హనుమ విహారికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు..పాల్గొనవారు పిట్టి సత్య, కాపీరశ్రీనివాసులు, మొయుదిన్, పుట్ట అజయ రెడ్డి, తంబీ సుజన కుమార్ తదితరులు పాల్గొన్నారు