విశాఖపట్నం:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఊహించని ఆఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రజాశాంతి పార్టీలో చేరితే సీఎంని చేస్తానని ప్రకటించారు. పవన్ కి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా.. ఎంత డబ్బు కావాలి..? అని కూడా ప్రశ్నించారు. విశాఖలో విూడియాతో మాట్లాడిన పాల్.. పవన్ కల్యాణ్, చంద్రబాబు పొత్తుతో ఒకే వేదిక విూద ఉన్న అతనిలో బాధ కనపడిరదన్నారు. కాపులు జనసేన, టీడీపి పొత్తుని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆకస్మికంగా చనిపోతాడని చెప్పాను.. అదే జరిగింది. తెలంగాణలో కేసీఆర్ చిత్తుగా ఓడిపోతారు అని చెప్పాను.. అది కూడా జరిగిందన్నారు. ఇప్పుడు దేశంలో రూపాయి విలువ పడిపోయింది.. మోడీ ప్రభుత్వం వచ్చాక అప్పు, నెలకి లక్షా పదివేల కోట్లుకి చేరిందన్నారు.