’’నూటికో కోటికో ఒక్కరు, ఎక్కడో ఎప్పుడో పుడతారు’’
సమాజం కోసం సొంత స్థలంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మించి ఇచ్చిన నాగులకొండ గోపి సత్యనారాయణ
పాలకొల్లు ఫిబ్రవరి 26: ‘‘నూటికో కోటికో ఒక్కరు, ఎక్కడో ఎప్పుడో పుడతారు’’అన్న సామెతకు సార్ధకత చేకూర్చారు నాగులకొండ గోపి సత్యనారాయణ. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లోని శ్రీ సత్య సాయి నగర్‌ చిత్ర చెరువు గట్టులో తమ సొంత స్థలంలో శ్రీ సాయి గాయత్రి కమ్యూనిటీ హాల్‌ పేరుతో నాగులకొండ గోపి సత్యనారాయణ నిర్మించి సమాజానికి అంకితం చేసినట్లు కమ్యూనిటీ హాల్‌ అధ్యక్షులు ముదపాక శివ వర ప్రసాద్‌ రాజా,ప్రధాన కార్యదర్శి వింజరపు శంకరాచార్యులు, గౌరవ అధ్యక్షులు నాగులకొండ సదానందాచార్యులు, తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణ దాత బ్రహ్మశ్రీ నాగులకొండ గోపి సత్యనారాయణ ఆధ్వర్యంలో కమిటీ తేది. 17.9.2023 న ఏర్పాటు అయినది. సంఫీుయుల నుండి విరాళాలు సేకరించి ఫస్ట్‌ ఫ్లోర్‌ డైనింగ్‌ హాల్‌ కు అనువుగా నిర్మించినారు. ‘వెస్సో ట్రస్ట్‌’ జన్మస్థలం పాలకొల్లు అయినందున వెస్సో ట్రస్ట్‌ సభ్యులు కూడా విరివిగా విరాళాలు ఇచ్చారు. మిగిలిన పనులు డైనింగ్‌ హాల్‌ సుందరీకరణ, టైల్స్‌, గోడలకు ఎలివేషన్‌, గ్లాస్‌ వర్క్‌, జనరేటరు, లిఫ్టు, అలాగే పైన స్లాబ్‌ పై పెళ్లివారికి 6 గదులు, రూఫ్‌ గార్డెన్‌ లునిర్మించవలసి ఉన్నది. ఈ నిర్మాణంలో ముఖ్య విశేషం ఏమనగా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏ ఒక్క రూపాయి సహాయం పొందలేదు. కమ్యూనిటీ హాల్‌ కు సంబంధించి మిగిలిన నిర్మాణముల కొరకు సంఫీుయుల సహాయ సహకారాలు అందించవలసినదిగా కమిటి విజ్ఞప్తి చేసింది. ఈ కమ్యూనిటీ హాల్‌ ఇటీవల ప్రారంభమై అన్ని హంగులతో ఫంక్షన్‌ జరుపు కోవడానికి సిద్ధముగా ఉన్నట్లు వారు తెలిపారు.ఈ సమావేశం లోకోశాధికారి పాలవలస స్వామి వరప్రసాద్‌ (శిల్పి),ఉపాధ్యక్షులు గొన్నాబత్తుల సత్యనారాయణ ,ఉప ప్రధాన కార్యదర్శి గురజాపు లాల్‌ బహదూర్‌ శాస్త్రి,కమిటీ నెంబర్స్‌ కడియం మురళి , ధవలేశ్వరం పాపచార్యులు, లక్కోజు శంకరం , కర్రి మురళీకృష్ణ , గోల్తి రాము , శంబాని వీరాచార్యులు , చెల్లూరి ఆదిమూర్తి , మానేపల్లి ఈశ్వరరావు , పట్నాల విశ్వనాథం , గొన్నాబత్తుల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నాగులకొండ గోపి సత్యనారాయణ మ్డంపతులను వారు ఘనంగా సత్కరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *