జంట హత్య కేసులో ఇద్దరికీ ఉరి శిక్ష , మరొకరికి యావజ్జీవ కారాగార శిక్ష
మహిళల పై నేరాలు చేసే వారికి ఈ కేసు ఒక కనువిప్పు
జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్‌ వెల్లడి
కర్నూలు:మహిళలకు సంబంధిచిన కేసులలో త్వరితగతిన కేసు ట్రయల్స్‌ పూర్తి చేసి శిక్షలు పడేవిధంగా చర్యలు చేపట్టామనీ జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్‌ తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ కేసులో ఇది సంచలన తీర్పు అని జిల్లా ఎస్పీ తెలిపారు. కర్నూలు కల్లూరు మండలం,. చెన్నమ్మ సర్కిల్‌ నందు గత సంవత్సరం జంట హత్యల కేసులు నమోదయ్యాయని, వధువు ను, ఆమె తల్లిని దారుణంగా హత్య చేసి, వధువు తండ్రి పై హత్యాయత్నం చేశారన్నారు. గత ఏడాది తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా కు చెందిన రుక్మిణీ కి కర్నూలు కు చెందిన శ్రవణ్‌ తో వివాహం జరిగిందనీ వివాహం అయిన 3 రోజుల తరువాత వధువు రుక్మిణీ తల్లిదండ్రులు అయిన వెంకటేష్‌, రమాదేవి లు, పెళ్ళి కుమారుడైన శ్రవణ్‌ , అతని తల్లి దండ్రులైన వర ప్రసాద్‌ , కృష్ణవేణి లతో శ్రవణ్‌ కుమార్‌ నపుంసకుడు అని గొడవపడ్డారని తెలిపారు. ఈ విషయం పై ముద్దాయిలు వీరి కుటుంబం పరువు పోతుందని పెళ్ళికూతురు మరియు ఆమె తల్లితండ్రులను హతమార్చాలని నిందితులు నిర్ణయించుకున్నారన్నారు. కర్నూలు టౌన్‌ చింతలముని నగర్‌ లోని ఇంటి వద్ద కత్తుల తో పొడవగా వధువు రుక్మిణి,ఆమె తల్లి రమాదేవి లు అక్కడికక్కడే చనిపోయారు. వధువు తండ్రి వెంకటేశ్‌ తీవ్రముగా గాయపడ్డాడు.
వధువు తండ్రి వెంకటేష్‌ ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేయటం జరిగిందన్నారు.

నిందితులు శ్రవణ్‌ కుమార్‌ , వరప్రసాద్‌ , కృష్ణవేణి ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ముద్దాయిలను జైల్లో నే పెట్టి ట్రయల్‌ పూర్తి చేయడం జరిగింది. ఈ కేసులో 90 రోజుల లో విచారణ పూర్తి చేసి, చార్జ్‌ సీట్‌ కోర్టులో ఫైల్‌ చేసారు. నాలుగవ జిల్లా అదనపు కోర్టు జడ్జి విచారణ పూర్తి చేసి ముద్దాయి ఏ`1 శ్రవణ్‌ కుమార్‌, ఏ`2 వరప్రసాద్‌ ఏ ప్రసాద్‌ కు ఉరిశిక్ష, ఏ`3 కృష్ణవేణికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడిరచారు. మహిళల పై నేరాలు చేసే వారికి ఈ కేసు గుణపాఠంగా, కనువిప్పు కలిగేలా చేసిందని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్‌ తెలిపారు.
RRRRR

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *