అన్నమయ్య జిల్లా :రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లెలో తన స్వగృహంలో తన వర్గీయులతో కలిసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన రాయచోటి టిడిపి ఇన్చార్జ్, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసులు రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్ రెడ్డి…

సమావేశానికి హాజరైన రాయచోటి నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన రమేష్ కుమార్ రెడ్డి అనుచర వర్గీయులు…

ఆత్మీయ సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల ఫోటోలు…

తన ఫోటోతో పాటు తన తండ్రి దివంగత మాజీ మంత్రి ఆర్.రాజగోపాల్ రెడ్డి, టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ…

సంచలన వ్యాఖ్యలు చేసిన టిడిపి రాయచోటి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్ రెడ్డి

టిడిపిలో నేను సరిగ్గా పని చేయలేదన్న ఒక బాధను తనకు కలుగజేశారు టిడిపిలోని కొందరు సభ్యులు…

జిల్లాలోనే నేను పని చేసిన విధంగా ఏ ఒక్క నాయకుడు పనిచేయలేదు…

పార్టీ కోసం రాయలసీమలోనే ఏ ఒక్క నాయకుడు పనిచేయని విధంగా నేను పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని నేను…

ఈ రోజు పార్టీలోని కొంతమంది ఇటువంటి సమాచారాన్ని దాచిపెట్టి, నేను ఏ పని చేయలేదని పార్టీకి సమాచారాన్ని చేరవేయడం చాలా బాధాకరం…

ఇతర పార్టీలో నుంచి టిడిపి లోకి వలస వచ్చిన కొందరు నాయకులు పార్టీనే ప్రలోభాలకు చేసి టికెట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు…

నేను పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడ్డ, గ్రామ గ్రామం తిరిగా, తొక్కని గడపంటూ తొక్క, పార్టీ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లా, కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించా…

ఈ జీవితంలో పోరాటం తప్పు నుంచి మరో మార్గం లేదని నేను భావిస్తున్న…

పోరాటం చేయక తప్పదు, ఈ పోరాటాన్ని మనమందరం కొనసాగించాలి…

ఈ పోరాటానికి మీరందరూ సహాయ సహకారం అందించాలి…

నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడుసార్లు ఓడిపోయాను…

2024లో నేను రాయచోటి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటా…

అందరూ నన్ను ఆశీర్వదించాలి….

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *