భయపెడుతున్న కొత్త వేరియంట్లు
విశ్లేషణ)
ప్రపంచాన్ని గడగడలాడిరచిన కరోనా వైరస్‌ ఏదో ఒక మూలన కొత్త వేరియంట్లతో ప్రజల ముందుకు వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచానికి మరొక వైరస్‌ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కోవిడ్‌ కంటే ఘోరంగా ఉండబోతోందని అంటున్నారు. గతంలో వచ్చిన స్పానిష్‌ ఫ్లూ మాదిరిగా ఈ కొత్త వైరస్‌ 50 మిలియన్ల మంది ప్రాణాలని తీసేస్తుందని అంచనా వేస్తున్నారు. మన కంటికి కనిపించకపోయినా అనేక రకాల వైరస్‌ లు కొత్త రూపాన్ని సంతరించుకుంటూ తిరుగుతూనే ఉన్నాయి. అవన్నీ మానవులకు ముప్పు కలిగించవు. కానీ కొన్ని మహమ్మారిని ప్రేరేపించే వేలాది రకాల వైరస్‌ లు పరిణామం చెందుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో కొవిడ్‌`19 కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. స్పానిష్‌ ఫ్లూతో కోట్లాది మంది చనిపోయినట్టే, ఈ కొత్త వైరస్‌ కారణంగా కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని బ్రిటన్‌ వ్యాక్సిన్‌ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహించిన సైంటిస్టు కేట్‌ బ్రిఘం హెచ్చరించారు. జంతువుల్లో వైరస్‌ విస్తరిస్తుందని, మ్యుటేషన్లు ఏర్పడి మానవాళికి పెద్ద సవాల్‌గా మారుతుందని తాను రాసిన ఓ పుస్తకంలో బ్రిఘం వివరించారు. ఈ పుస్తకానికి వ్యాక్సిన్‌ నిపుణుడు టిమ్‌ హ్యామ్స్‌ సహ రచయితగా ఉన్నారు. ‘వేలాది రకాల వైరస్‌ల నుంచి మహమ్మారి ప్రబలేందుకు అవకాశముంది. ఇందులో 25 వైరస్‌ కుటుంబాలను సైంటిస్టులు గుర్తించారు.ప్రతి కుటుంబంలో వేలాది రకాల వైరస్‌లుంటాయి. దీంట్లో ఏదో ఒక వైరస్‌ వల్ల మహమ్మారి ప్రబలే అవకాశముంది’ అని టిమ్‌ హ్యామ్స్‌, బ్రిఘం తెలిపారు. భవిష్యత్తులో మహమ్మారి రాబోతున్నదని డబ్ల్యూహెచ్‌వో 2018లో హెచ్చరించింది. వైరస్‌ను ‘డిసీజ్‌ ఎక్స్‌’గా పేర్కొన్నది. ఎబోలా, హెచ్‌ఐవీ`ఎయిడ్స్‌, కొవిడ్‌`19 వైరస్‌లు తొలుత జంతువుల్లో ప్రవేశించి, ఆ తర్వాత జంతువుల నుంచి మానవులకు సోకాయి. డిసీజ్‌`ఎక్స్‌ కూడా అదేవిధంగా ఉండొచ్చునని సైంటిస్టులు భావిస్తున్నారు. అత్యధికంగా మరణాల రేటు కలిగిన ఎబోలా, బర్డ్‌ ఫ్లూ, మెర్స్‌.. వైరస్‌లనే అరికట్టాం, రాబోయే మహమ్మారిని సులభంగా ఎదుర్కొనవచ్చునన్న అభిప్రాయాన్ని బ్రిగం, హేమ్స్‌ కొట్టిపారేశారు.జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాల నుంచి వైరస్‌లు మానవులకు సోకుతుండటంపై పరిశోధనలు చేసి, ‘బ్యాట్‌వుమన్‌’గా ప్రసిద్ధి చెందిన చైనీస్‌ వైరాలజిస్ట్‌ షి రెaంగ్లి సంచలన హెచ్చరిక చేశారు. భవిష్యత్తులో మరో కొత్త కరోనా వైరస్‌ పుట్టుకురావొచ్చని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని తెలిపారు. వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి చెందిన షి బృందం 40 కరోనా వైరస్‌ జాతుల వల్ల మానవులపై పడే ప్రభావంపై అధ్యయనం చేసింది. వీటిలో దాదాపు సగం వైరస్‌ జాతులు అత్యంత ప్రమాదకరమైనవని గుర్తించింది.ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు 25 రకాల వైరస్‌ కుటుంబాల గురించి తెలుసుకున్నారు. వాటిలో ప్రతి ఒక్కటి వందలు లేదా వేల మ్యూటేషన్‌ ని కలిగి ఉన్నాయి. వీటిలో ఏదైనా కూడా మహమ్మారిని కలిగించే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడిరచారు. కోవిడ్‌ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 మిలియన్ల మందిని చంపింది. అదృష్టవశాత్తు వైరస్‌ సోకిన వారిలో ఎక్కువ మంది కోలుకోగలిగారు. ఎబోలా మరణాల రేటు 67 శాతంగా ఉంది. తర్వాత బర్డ్‌ ఫ్లూ 60 శాతం వచ్చింది. మెర్స్‌ కూడా 34 శాతం వరకి ప్రజలకి సోకింది. అందుకే కొత్తగా వచ్చే తదుపరి మహమ్మారి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేనని నిపుణులు తెలిపారు. అయితే డబ్యూహెచ్‌ఓ కి చెందిన నిపుణులు మెక్‌ కాలీ మాట్లాడుతూ తదుపరి మహమ్మారికి కారణమయ్యేది భయంకరమైన స్పానిష్‌ ఫ్లూ లాంటిది కావచ్చని హెచ్చరించారు. కోవిడ్‌ వ్యాప్తి చెందినప్పటి నుంచి శాస్త్రవేత్తలు తదుపరి మహమ్మారికీ కారణమయ్యే ఇతర ప్రమాదకరమైన వైరస్‌ కోసం శోధిస్తున్నారు. ఇది స్పానిష్‌ ఫ్లూ మాదిరిగా కేసుల పెరుగుదల, మరణాల సంఖ్య ఉండవచ్చని భావిస్తున్నారు. స్పానిష్‌ ఫ్లూ అనేది 1918 లో వచ్చింది. ప్రపంచ జనాభాలో మూడిరట ఒక వంతు మందికి సోకింది. పక్షుల నుంచి వచ్చిందని అంటారు. 1918 నుంచి 1919 వరకు 50 మిలియన్ల మంది దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య కంటే ఈ వైరస్‌ వల్ల చనిపోయిన వాళ్ళే సంఖ్య రెండు రేట్లు ఎక్కువ. అడవి, పెంపుడు పక్షుల నుంచి ఉద్భవించిందని కొందరు వాదిస్తారు. మరికొందరు పందుల నుంచి వచ్చిందని చెప్తారు. చైనా, ఫ్రాన్స్‌, యూఎస్‌, బ్రిటన్‌ సహ అన్నీ ప్రాంతాలని ఇది కబళించింది.కరోనా వైరస్‌ మాదిరిగా కాకుండా స్పానిష్‌ ఫ్లూ యువతలో ముఖ్యంగా ఐదు కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలలో, 20`40 సంవత్సరాల వయసు వారికి సోకింది. ఇది అత్యంత శక్తివంతమైనది. వ్యాధి లక్షణాలు కనిపించిన 24 గంటల్లోపే ఆరోగ్యంగా ఉన్న రోగి ప్రాణాలు కూడా తీసేస్తుంది. న్యుమోనియా, శరీరం విూద బొబ్బలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరితిత్తులు పని చేయడం ఆగిపోతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *