కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైస్సార్‌సీపీకి గుడ్‌బై
టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం.. నారా లోకేశ్‌తో భేటీ
కడప ఫిబ్రవరి 7: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సవిూపిస్తున్న వేళ అధికార వైస్సార్‌సీపీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో ‘బిగ్ స్ట్రోక్’ తగలబోతోంది. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు.కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల సవిూపిస్తున్న వేళ రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శల వేడి పెరిగింది. జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత దేవగుడి నారాయణ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డబ్బు సంచులతో నాయకులు చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. భూపేష్ రెడ్డి నాయకత్వంలో జమ్మలమడుగులో టీడీపీ విజయం వైపు అడుగులు వేస్తోందని దీమా వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ భూబాధితులకు వైసీపీ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని పేర్కొన్నారు. జమ్మలమడుగు వైసీపీ నేతలు టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారని చెప్పారు.