విజయవాడ: బిజెపి రాష్ట్ర కార్యాలయం లో రాష్ట్ర లీగల్ సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ లీగల్ సెల్ ప్రారంభ సమావేశం పాల్గొని దిశానిర్దేశం చేసారు.
దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రెండు నెలల్లో మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. అన్ని స్థాయిల్లో క్యాడర్ ను ఇందుకు సన్నాహం చేయాలి. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో కార్యాలయాలు ఏర్పాటు చేశాం. ఈ ఎన్నికలు లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయి . పొత్తు విూద నిర్ణయం అనేది కేంద్ర పెద్దలు నిర్ణయం చేస్తారు. వారి ఆదేశాలు వచ్చే వరకు.. బీజేపీ బలోపేతం చెందేలా ప్రతి కార్యకర్త నిబద్దతతో ఎన్నికల లోపని చేసేవిధంగా తయారు గా ఉంటాం. బీజేపీకి ప్రజాదరణ పెరిగిందని అన్నారు.
పార్టీలో లీగల్ సెల్ ను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపే విధంగా పార్టీ అండగా నిలుస్తుంది. వచ్చే ఎన్నికలలో లీగల్ సెల్ ఏ విధంగా పని చేయాలనే దానిపై ఈరోజు చర్చిస్తున్నామని అన్నారు.అన్ని జిల్లాల్లో లీగల్ సెల్ టీంలను ఇప్పటికే నియమించాం. వారందరితో ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడి.. దిశానిర్దేశం చేస్తాం. సర్పంచ్ లు కు ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. గ్రావిూణాభివృద్ది కోసం కేంద్రం నిధులు ఇస్తే.. వాటిని కూడా సొంత ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించింది. దీనిపై రాష్ట్ర బీజేపీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. టీడీపీ వైసీపీ తో పాటు జనసేన సర్పంచ్ లు కూడా బీజేపీ ఆందోళనకు మద్దతు పలికారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఒక కమిటీని రాష్ట్రానికి పంపారు. కేంద్రం గ్రామాల కు ఇచ్చిన నిధులు, ఉపాధి హావిూ కోసం వచ్చిన నిధులను దారి మళ్లించినట్లు కమిటీ నిర్ధారించిందని అన్నారు.
వైసీపీ పాలనలో గ్రామాలలో అభివృద్ది అనేది కానరాకుండా పోయింది. అనేక మంది సర్పంచ్ లు సొంత డబ్బుతో గ్రామాలలో అభివృద్ది పనులు చేశారని అన్నారు.
వారికి బిల్లులు కూడా జగన్ చెల్లించకపోవడంతో.. పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎపీలో రోడ్ల పరిస్థితి, తాగునీటి వసతి లేక.. సర్పంచ్ లు సీఎంను నిలదీసే పరిస్థితి. ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో.. సర్పంచ్ లు ఆవేదన వెలిబుచ్చేందుకు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు
అక్కడ సర్పంచ్ లను అరెస్టులు చేయడం వైసీపీ ప్రభుత్వ నియంతృత్వాన్ని తెలియ చేస్తుంది. సర్పంచ్ ల ఆందోళనకు, ఆవేదనకు బీజేపీ మద్దతుగా ఉంటుంది. పొత్తులు ఎలా ఉన్నప్పటికీ.. బీజేపీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళతామని అన్నారు.
ఈ సమావేశానికి లీగల్ సెల్ కన్వీనర్ పివి ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించారు. లీగల్ సెల్ ఇంఛార్జి పాకా వెంకట సత్యనారాయణ,కో కన్వీనర్ లు అజయ్ కుమార్, మల్లిఖార్జున మూర్తి,ఇస్రాయిల్ వేదిక ను అలంకరించారు. సమావేశం లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు