అమరావతి ఫిబ్రవరి 5: ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. ఈ ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. నవరత్నాలు పేరుతో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే మరోసారి అధికారంలోకి కూర్చోబెడతాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు.. సీఎం జగన్మోహన్‌ రెడ్డి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, మూడు రాజధానుల ప్రకటనతో మూడుముక్కలాట ఆడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కాదుకదా అభివృద్ధిలో వెనక్కు పరుగులు పెడుతోందని ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడి రావడం లేదని, నేరాలు, దాడులు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని, రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని, మద్యం ఏరులై పారుతోందని.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రభుత్వం తీసుకువచ్చిన అన్ని అంశాల్లోనూ లోపాలు ఉన్నాయని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఐదేళ్లు వైసీపీకి అధికారం ఇచ్చి తప్పుచేశామని, మరోసారి ఆ తప్పు చేయకూడదని ప్రజలకు సూచిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. అయితే.. రాష్ట్రంలోని అనేక అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు రేషనల్‌ సాంప్లింగ్‌ టెక్నిక్‌ పద్ధతి ద్వారా సర్వే నిర్వహించగా.. అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
1) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మద్యం ధరలు, మద్యం లభ్యత, నాణ్యత, సరఫరా తదితర అంశాలపై విూ అభిప్రాయం ఏంటి ?
ఈ అంశంపై 2024 జనవరి 1 నుంచి జనవరి 20 మధ్య 15 మంది సర్వే సిబ్బంది 3000 శాంపిల్స్‌ (ప్రజలు) సర్వే నిర్వహించారు. 8 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. ం) చాలాబాగుంది: 5%, ః) బాగుంది : 5%, అ) పర్వాలేదు : 10%, ఆ) బాగోలేదు : 30%, ఇ) అస్సలు బాగోలేదు : 50% అభిప్రాయం వ్యక్తం చేశారు.
2) రోడ్లు, వంతెనలు, కాలువలు తదితర మౌలిక సదుపాయాల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి నిర్వహణ, మరమ్మతులు తదితర అంశాలపై విూ అభిప్రాయం ఏంటి ?
ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 25 మంది సర్వే సిబ్బంది 9000 శాంపిల్స్‌ (ప్రజలు) పై సర్వే నిర్వహించారు. 8 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. ం) చాలాబాగుంది: 5%, ః) బాగుంది : 10%, అ) పర్వాలేదు : 10%, ఆ) బాగాలేదు : 25%, ఇ) అస్సలు బాగోలేదు : 50% అభిప్రాయం వ్యక్తం చేశారు.
3) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ విధానం తదితర అంశాలపై విూ అభిప్రాయం ఏంటి ?
ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 10 మంది సర్వే సిబ్బంది 6000 శాంపిల్స్‌ (ప్రజలు) పై సర్వే నిర్వహించారు. 18 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. ం) చాలా బాగుంది : 25%, ః) బాగుంది : 40%, అ) పర్వాలేదు : 15%, ఆ) బాగోలేదు : 10%, ఇ) అస్సలు బాగాలేదు : 10% అభిప్రాయం వ్యక్తం చేశారు.
4) యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ కల్పన, పారిశ్రామికాభివృద్ధి తదితర అంశాల పై విూ అభిప్రాయం ఏంటి ?
ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 25 మంది సర్వే సిబ్బంది 9000 శాంపిల్స్‌ (ప్రజలు) పై సర్వే నిర్వహించారు. 21 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. ం) చాలాబాగుంది : 5%, ః) బాగుంది : 15%, అ) పర్వాలేదు : 10%, ఆ) బాగాలేదు : 30%, ఇ) అస్సలు బాగాలేదు : 40% అభిప్రాయం వ్యక్తం చేశారు.
5) విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థ నిర్వహణ, విద్యుత్‌ కోతలు నివారణ, విద్యుత్‌ ధరలు తదితర అంశాలపై విూ అభిప్రాయం ఏంటి ?
ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 25 మంది సర్వే సిబ్బంది 6000 శాంపిల్స్‌ (ప్రజలు) పై సర్వే నిర్వహించారు. 8 పార్లమెంట్‌, 20 నియోజకవర్గాలు, 160 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. ం) చాలాబాగుంది: 10%, ః) బాగుంది : 10%, అ) పర్వాలేదు : 10%, ఆ) బాగాలేదు : 25%, ఇ) అస్సలు బాగాలేదు : 55% అభిప్రాయం వ్యక్తం చేశారు.
6) ప్రజారవాణా, ఆర్టీసీ బస్సులు, బస్‌స్టేషన్ల నిర్వహణ, ప్రయాణీకుల సౌకర్యాలు, భద్రతాప్రమాణాలు, టికెట్‌ ధరలు నియంత్రణ అంశాలపై విూ అభిప్రాయం ఏంటి ?
ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 10 మంది సర్వే సిబ్బంది 3000 శాంపిల్స్‌ (ప్రజలు) పై సర్వే నిర్వహించారు. 8 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. ం) చాలా బాగుంది: 25%, ః) బాగుంది : 15%, అ) పర్వాలేదు : 10%, ఆ) బాగాలేదు : 20%, ఇ) అస్సలు బాగాలేదు : 30% అభిప్రాయం వ్యక్తం చేశారు..
7) ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, పిల్లలకు కల్పించే సదుపాయాలు మధ్యాహ్నభోజనం తదితర అంశాలపై విూ అభిప్రాయం ఏంటి ?
ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 25 మంది సర్వే సిబ్బంది 6000 శాంపిల్స్‌ (ప్రజలు) పై సర్వే నిర్వహించారు. 20 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. ం) చాలాబాగుంది: 35%, ః) బాగుంది : 25%, అ) పర్వాలేదు : 20%, ఆ) బాగాలేదు : 15%, ఇ) అస్సలు బాగాలేదు : 5% అభిప్రాయం వ్యక్తం చేశారు.
8) ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఔషదాలు, ఆరోగ్య పరీక్ష కేంద్రాలు, అంబులెన్స్‌ నిర్వహణ, ఆరోగ్య శ్రీ సేవలు తదితర అంశాల పై విూ అభిప్రాయం ఏంటి ?
ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 15 మంది సర్వే సిబ్బంది 3000 శాంపిల్స్‌ (ప్రజలు) పై సర్వే నిర్వహించారు. 8 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. ం) చాలాబాగుంది : 20%, ః) బాగుంది : 20%, అ) పర్వాలేదు : 15%, ఆ) బాగాలేదు : 20% ఇ) అస్సలు బాగోలేదు : 25% అభిప్రాయం వ్యక్తం చేశారు.
9) నగరాలు, పట్టణాలు, గ్రామాలు, పంచాయతీలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, మురికి కాలువలు, పార్కులు, రోడ్ల నిర్వహణ, పన్నులు తదితర అంశాల్లో విూ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ పనితీరుపై విూ అభిప్రాయం ఏంటి ?
ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 15 మంది సర్వే సిబ్బంది 6000 శాంపిల్స్‌ (ప్రజలు) పై సర్వే నిర్వహించారు. 12 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. ం) చాలా బాగుంది : 10%, ః) బాగుంది : 10 %, అ) పర్వాలేదు : 20%, ఆ) బాగాలేదు : 20%, ఇ) అస్సలు బాగాలేదు : 40% అభిప్రాయం వ్యక్తం చేశారు.
10) రాష్ట్రంలో రైతులకు ఎరువుల సరఫరా, సాగునీరు, విద్యు?త్‌, ధాన్యం సేకరణ, గిట్టుబాటు ధర చెల్లింపులు తదితర అంశాలపై విూ అభిప్రాయం ఏంటి ?
ఈ అంశంపై జనవరి 5 నుంచి జనవరి 20 మధ్య 15 మంది సర్వే సిబ్బంది 12,000 శాంపిల్స్‌ (ప్రజలు) పై సర్వే నిర్వహించారు. 22 పార్లమెంట్‌ నియోజకవర్గాలు, 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే జరగగా.. ం) చాలాబాగుంది: 15%, ః) బాగుంది : 20 %, అ) పర్వాలేదు: 10%, ఆ) బాగాలేదు : 25%, ఇ) అస్సలు బాగాలేదు: 30% అభిప్రాయం వ్యక్తం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *