రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంలోనూ, జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాలకు స్థలాల కేటాయింపు, అధునాతన భవనాల నిర్మాణంలోనూ మరీ ముఖ్యంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీసుకుంటున్న చొరవ సత్ఫలితాల దిశగా అడుగులు పడుతున్నాయి.జిల్లా కేంద్రం కాకమునుపే రాయచోటిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, డిఎస్పి కార్యాలయాలను మంజూరు చేయించారు. రాయచోటి పట్టణ ప్రాంతంలో జనాభా విస్తరిస్తున్న దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణకు, శాంతి భద్రతల పరిరక్షణకు అనుగుణంగా పోలీస్ కార్యాలయాల ఏర్పాట్లుపై ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపారు. ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషి , పట్టుదలతో రాయచోటి నియోజక వర్గ ప్రజల కలలు నెరవేరుతున్నాయి. ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలను అందించేందుకు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చొరవతో రాయచోటి పట్టణంలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భవన నిర్మాణానికి కు రూ.2 కోట్లు, డి ఎస్ పి కార్యాలయ భవన నిర్మాణానికి రూ.ఒక కోటి నిధులను మంజూరు చేయించారు. ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ను పట్టణంలోని చిత్తూరు మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఎస్ టి కాలనీ వద్ద 1.14 ఎకరాల విస్తీర్ణంలోనూ, డి ఎస్ పి కార్యాలయాన్ని కడప రహదారి మార్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా 1.50 ఎకరాల విస్తీరణంలో అత్యంత సుందరంగా నిర్మాణాలను, శర వేగంగా భవన నిర్మాణాలను నిర్మింపచేసారు. సదరు భవనాలను రేపు నెలలో ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.
ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏర్పాటుతో:
ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఏర్పాటుతో పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు దోహదపడుతోంది. రోజు రోజుకు విస్తరిస్తున్న పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక్కడ స్టాఫ్ వివరాలు: ఎస్ ఐ: 1, ఏ ఎస్ ఐ:1, హెడ్ కానిస్టేబుళ్లు:4,కానిస్టేబుళ్లు: 10, హోమ్ గార్డ్స్: 5, త్వరలో సి. ఐ స్థాయి అధికారిణి ఏర్పాటుకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
డి ఎస్ పి కార్యాలయం ఏర్పాటుతో:
రాయచోటి ప్రజలకు గతంలో ఒక చిన్న మైక్ పర్మిషన్ కావాలన్నా, ఇతర పోలీసు శాఖ పనులపై పులివెందులకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ వ్యయ ప్రయాసలు తప్పాయి. శాంతి భద్రతల మెరుగునకు డి ఎస్ పి స్థాయి అధికారి ఎల్లవేళలా అందుబాటులో ఉండటం స్థానిక పోలీసు అధికారుల సమన్వయంతో మరింత మెరుగ్గా సేవలు అందించే అవకాశం ఏర్పడింది.
హర్షాతిరేకాలు:
నిత్యం రద్దీగా ఉండే రాయచోటిలో ట్రాఫిక్ పోలీసు స్టేషన్, డి ఎస్ పి కార్యాలయాలను ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయించారు. ఆయా శాఖల సేవలు అందుబాటులో ఉన్న భవనాలను ఉపయోగించుకుని విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం భవనాల నిర్మాణాలు పూర్తి అయి ప్రారంభానికి సిద్ధం అవ్వడంపై నియోజక వర్గ ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుచున్నాయి. రాయచోటి నియోజక వర్గ ప్రజలతో పాటు పీలేరు, నియోజక వర్గాల ప్రజలకు ,రాజంపేట నియోజక వర్గంలోని సుండుపల్లె, వీరబల్లె మండలాల ప్రజలుకు డి ఎస్ పి కార్యాలయం సౌకర్యంగా ఉంటోంది. ఇందుకు నిధులు మంజూరు చేసిన సీఎం జగన్, సహకరించిన ఎంపీ మిథున్ రెడ్డి, అన్నీ తానై వ్యవహరించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషి పట్ల నియోజక వర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుచున్నారు.