స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొనబోతున్న సమస్య బెండ్ ఓవర్

●తప్పుడు కేసులు పెడితే సంబంధిత అధికారులకు ఎలా పిర్యాదు చేయాలి ? తప్పుడు కేసుకు పెట్టిన సంబంధిత అధికారులు మీది హైకోర్టు రిట్ దిగువ కోర్టులలో ప్రేవేటు కంప్లైంట్ వేసుకోవచ్చు

● ఐపీసీ166Aప్రకారం (Public servent disobeyiny law) ప్రభుత్వ సేవకుడు చట్టాన్ని ధిక్కరిస్తే 6 నెలల నుంచి 3 సంవత్సరాలు శిక్ష లేక జరిమానా లేక శిక్ష మరియు జరిమానా విధించవచ్చు ఎన్నికల సందర్భంలో తహసీల్దార్ CrPC 107,108,109,110 మరి పెద్దకేసులు అయితే 151 ప్రకారం బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది.

● చాలా మంది ప్రజలు మా మీద బైండ్ ఓవర్ కేసులు పేరిట మా మీద తప్పుడు కేసులు MRO, పోలీసువారు పెడుతున్నారని వాపోతున్నారు.

●ఎవరి మీద బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తారు
గతంలో కేసుల్లో ఉన్నవారిని, ఎన్నికల్లో గొడవలు చేస్తారని ఎన్నికల్లో మద్యం పంపిణీ చేసేవారిని, , సమాజంలో శాంతికి భంగం కలిగించే వ్యక్తులను, ఎన్నికల్లో నోట్లు పంచేవారిని, MRO ముందర బైండ్ ఓవర్ చేస్తారు.

● ఎలా బైండ్ ఓవర్ ఓవర్ కేసులు పెడతారు
ఒక వ్యక్తి గురించి లేక వ్యక్తులు గురించి పోలీస్ వారు MRO గారికి సమాచారం అందిస్తారు సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తారు నీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి ఎన్నికలలో ఎలాంటి అవంచానియా సంఘాటనాలకు పాల్పడరాదు మీరు/నీవ్వు సంజాయిషీ ఇచ్చుకోవాలి అని నోటీసులు జారిచేస్తారు.

●సంబంధిత వ్యక్తులు/వ్యక్తి ఆ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలి. MROకి సంబంధిత వ్యక్తి ఇచ్చిన సమాధానం వలన సంతృప్తి చెందితే ఎలాంటి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయరాదు.

● ఒకవేళ ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం సంతృప్తి కాకపోతే బైండ్ ఓవర్ కేసులు పెడతారు అలాంటి వారిని సెల్ఫ్ బాండ్ మీద గాని లేదా అతనికి తెలిసిన వ్యక్తుల నుంచి పూచీకత్తు తీసుకొని వదిలివేయడం జరుగుతుంది.

Mandal Executive Megistrate (MRO) తహసీల్దార్లు హోదాలో ఉన్నవారే బైండ్ ఓవర్ కేసులో నమోదు చేస్తారు.

●ఎవరి మీద అంటే వారి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడానికి వీలులేదు crpc 108 కింద నోటీసులు ఇచ్చిన తరువాత సంబంధిత వ్యక్తి సమాధాననం ఇచ్చుకున్న తరువాత MRO సంతృప్తి చెందకపోతేనే బైండ్ ఓవర్ కేసులు పెట్టాలి.

●మంచి వ్యక్తుల మీద, పెద్దమనుషుల మీద వ్యక్తుల మీద ఎలాంటి నిందరోపణ లేని వ్యక్తుల మీద బైండ్ ఓవర్ కేసులు పెడితే

●హైకోర్టు రిట్ పిటిషన్ , క్రింద కోర్టులో వ్రేవేటు కేసు. పబ్లిక్ సర్వెంట్ కక్ష్య పూరితంగా పోలీసు లేక MRO మీద కేసులు వేయవచ్చు.

●MRO మీద కేసు ఫైల్ చేయాలంటే సంబంధిత MRO తన పై అధికారులైన RDO, కలెక్టర్ ఫిర్యాదు చేయాలి. చీఫ్ సెక్రటరికి పిర్యాదు చేయాలి. తరువాత న్యాయవాది ద్వారా నోటీసు పంపి ఎంక్వయిరి అడగాలి.

కోర్టులో కేసులు సంబంధిత MRO మీద కేసువేయవచ్చు.

SI అయితే అతని మీద CI, DSP, SP పిర్యాదు చేయాలి తరువాత DGP పిర్యాదు చేసి న్యాయవాది ద్వారా నోటీసు పంపిన తరువాత కోర్టులో కేసులు వేయాలి.

కోర్టుకి సంబంధిత MRO/SI/CI సంజాయిషి చెప్పుకోవాలి. అప్పుడు ప్రభుత్వ అధికారి అయి ఉండి చట్టం ధిక్కరించడం జరిగిందని నిరూపితం అయితే IPC166a ప్రకారం 6 నెలల నుంచి 3 సంవత్సరాలు వరకు జైలు శిక్ష లేకా జరిమానా లేక రెండు విధించవచ్చు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *