ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా తిరుపతి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వో లక్ష్మీపతి ఎన్నికయ్యారు. ఈ మేరకు విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏపీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా పీలేరు డిఎఫ్ఓ జేవీ. సుబ్బారెడ్డి, విజయవాడ డిఎఫ్ఓ రవిశంకర్ శర్మ వ్యవహరించారు. నూతన జనరల్ సెక్రెటరీగా విజయవాడ ఎఫ్ఆర్ఓ కే. శ్రీనివాసులు రెడ్డి , కోశాధికారిగా విశ్వేశ్వరయ్య, జాయింట్ సెక్రటరీగా ఏ. సౌజన్య, వైస్ ప్రెసిడెంట్ రాయలసీమ టి. ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రగా ఎస్ వి కె కుమార్, రిజనల్ సెక్రటరీ రాయలసీమగా అశోక్ యాదవ్, రిజనల్ సెక్రటరీ ఆంధ్రగా ఆర్. రాజాబాబు, అదన జాయింట్ సెక్రటరీగా పి.శ్రీనివాసరావులు ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఎన్నికైన లక్ష్మీపతి సిసీఎఫ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. నూతనంగా ఆఫీస్ బీరెర్స్ ను అభినందించారు.