అన్నమయ్య జిల్లా , రాయచోటి:రాబోవు ఎన్నికలలో రాయచోటి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుస్తా…రాష్ట్రంలో చంద్రబాబును ముఖ్యమంత్రి ని చేస్తాం అంటున్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఆర్ రమేష్ కుమార్ రెడ్డి. సమృద్ధిగా వర్షాలు కురవక వ్యవసాయం చేసే స్థితిలో రైతులు లేరు ఒకవేళ చేసిన పంట చేతికొచ్చే పరిస్థితి లేదు.రైతు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించడం, ఇన్పుట్ సబ్సిడీ, క్రాఫ్ ఇన్సూరెన్స్ కల్పించి రైతును ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.రాష్ట్రంలోని అన్ని రంగాల వారు రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతుంటే వారి సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయకుండా వారి సమస్యలతో మాకేమి సంబంధం అన్నట్టుగా ఒక నియంతల వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి…
రాష్ట్రం మొత్తం అవినీతిమయం… ఓట్లు కొనడమే ప్రధాన లక్ష్యంగా వైసిపి:
రాయచోటిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం,దానికి వేచించే ధణం,శస్త్ర శాలలు అందుకు కావలసిన సిబ్బంది వివరాలతో ఒక జి ఓ విడుదల చేసింది చంద్రబాబు.రాబోవు రోజుల్లో టిడ్కో ఇళ్లకు రంగులు వేసి అవి కూడా మేమే ఇచ్చామని చెప్పినా ఆశ్చర్యపడనవసరం లేదు.నియోజకవర్గ అభివృద్ధి కోసం తీసుకువచ్చిన 3000 కోట్ల నిధులు దేనికి దేనికి ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం వైసిపి కి ఉందా.ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ…పోలీసులను అడ్డు పెట్టుకొని రాజ్యమేలుతూ… రాష్ట్రవ్యాప్తంగా అవినీతిని పెంచి పోషిస్తున్న వైసిపి నాయకులు.ఇటువంటి నియంత, అవినీతి చక్రవర్తులను నమ్మి ఓటు వేసే పరిస్థితుల్లో ప్రస్తుత రాష్ట్ర ప్రజలు లేరు.రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి ప్రజల ముందు పెడతాం.సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎంతోమంది కొత్త వారు వస్తూవుంటారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా మిత్రుడు అతనికి శుభాకాంక్షలు తెలపడానికి కలిశా… ఇందులో రాజకీయ కోణమేమీ లేదు.