గుంటూరు, డిసెంబర్ 18: జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సవిూపిస్తుండడంతో రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. వైసీపీకి ఏ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. ఇప్పటికే వైసిపి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థులను మార్చుతోంది. దీంతో పవన్ అలెర్ట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటనకు సంబంధించి కార్యకలాపాలను ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయాన్ని తిప్పి కొట్టాలని భావిస్తున్నారు. పవన్ పై తరచూ వైసిపి ఒక ఆరోపణ చేస్తోంది. నిన్నటి తెలంగాణ ఎన్నికల వేళ ఏపీలో అసలు పవన్ కు ఓటు లేదని.. హైదరాబాదులో ఉంటూ చంద్రబాబు ప్రయోజనాల కోసం పవన్ పరితపిస్తున్నారంటూ విపరీత వ్యాఖ్యలు చేసింది. దీనికి కౌంటర్ ఇవ్వాలని పవన్ భావించారు. అందుకే తన ఓటును మంగళగిరి కి మార్చుకున్నారు. మంగళగిరి పరిధిలోని కొత్తగా ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే జగన్ తాడేపల్లి లో, చంద్రబాబు ఉండవల్లి లో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో మరోసారి వైసీపీ నుంచి విమర్శలు రాకుండా పవన్ జాగ్రత్త పడ్డారు. ఓటుతో పాటు నివాసాన్ని సైతం మంగళగిరిలో ఏర్పాటు చేసుకుని ఆరోపణలకు చెక్ చెప్పాలని డిసైడ్ అయ్యారు.మంగళగిరి నియోజకవర్గ నుంచి లోకేష్ మరోసారి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హై కమాండ్ చెక్ చెప్పింది. టికెట్ ఇవ్వబోమని తేల్చడంతో ఆళ్ల పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మంగళగిరిలో వైసీపీ వ్యూహాత్మకంగా బీసీ కార్డును తెరపైకి తెచ్చింది. బిసి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని బరిలో దించనుంది. లోకేష్ ను ఎలాగైనా ఓడిరచాలని సీఎం జగన్ భావిస్తున్నారు. మంగళగిరిలో బీసీ సామాజిక వర్గం కూడా ఎక్కువ. మిత్ర ధర్మంగా పవన్ లోకేష్ ను గెలిపించుకునేందుకు తనవంతు ప్రయత్నంగా ఓటు మార్చుకున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే వైసిపి ఆరోపణలతో పాటు లోకేష్ ను ఓడిరచేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు చెక్ చెప్పేందుకుపవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.