విజయవాడ: కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జోన్ల వారీగా నియమించిన ఐఏఎస్ అధికారులు (రోల్ అబ్జర్వర్స్) ఎన్నికల సంఘం విధుల్ని విధిగా పాటించడం లేదని, వారు తమ విధులు సక్రమంగా నిర్వహించేలా ఏపీ ఎన్నికల కమిషనర్ కు టీడీపీనేతలు ఫిర్యాదు చేసారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పాత ఇంటి డోర్ నెంబర్లతోనే ఓటర్ జాబితా ఇచ్చారని, జనవరి 5 న ఇచ్చే కొత్త జాబితాలో కొత్త ఇంటినంబర్ల ప్రకారమే ఓటర్ల వివరాలు ఉండేలా చూడాలని కోరారు. ఓటర్ల జాబితాలోని పొరపాట్లు.. రాష్ట్రంలోని అధికారులు చేస్తున్నతప్పులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీకి నేతలు విజ్ఞప్తి చేసారు.రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు, సూచనలను కూడా ఖాతరు చేయకుండా వైసీపీ నేతల ఆదేశాలే పరమావధిగా పనిచేస్తున్న అధికారులు, కొందరు కలెక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధానాధికారిని కోరారు.