అన్నమయ్యజిల్లా,రాయచోటి,డిసెంబర్‌13: అన్నమయ్య జిల్లా పరిధిలోని రాజంపేట,రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో వేల ఎకరాల్లో సాగుచేసిన బొబ్బాయి,అరటి,చీని తదితర పంటలు మౌచింగ్‌ తుఫాన్‌ ప్రభావానికి నేలమట్టమయ్యాయని, పంటలు దెబ్బతిని వారం దాటిపోతున్నా సంబంధిత అధికారులు,ముఖ్యమంత్రిగాని నష్టపోయిన రైతులను,పరామర్శిండం,పంట నష్టపరిహారం చెల్లించడం చేయకుండా రాష్ట్రప్రభుత్వం మొద్దనిద్రలో ఉందని భారతీయ జనతాపార్టీ రాజంపేట పార్లమెంట్‌ జిల్లా  అధ్య క్షులు సాయిలోకేష్‌ విమర్శించారు. బుధవారం రాష్ట్ర కిసాన్‌ మోర్చా కమిటి ఆదేశాలు మేరకు అన్నమయ్యజిల్లా,రాయచోటిలోని జిల్లా కలెక్టర్‌ కార్యలయం వద్ద అన్నమయ్య జిల్లా రాయచోటి కో కన్వినర్‌ నిర్మల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పంటలు నష్టపోయిన రైతులు,ముఖ్యంగా మహిళా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారతీయ జనతాపార్టీ అన్నమయ్య జిల్లా ఇంఛార్జి చంద్ర మౌళి,అధ్యక్షులు సాయిలోకేష్‌  మాట్లాడుతూ  మౌచింగ్‌ తుఫాన్‌ ప్రభావానికి పంటలు సాగు చేసి నష్ట పోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంట నష్ట పరిహారం చెల్లించాలన్నారు.అంతేకాకుండా  తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్‌ ట్రాన్స్‌పార్మలు,కరెంట్‌ స్థంభాలను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. దెబ్బతిన్న పంటలను అధికారులు తూతూ మంత్రంగా తమ కార్యలయాల్లో నుంచే అంచనా వేస్తున్నారని మండిపడ్డారు. ఎకరానికి రూ.80వేలకు పైగా ఖర్చువస్తోందని,సంవత్సరకాలం కష్టపడ్డ కష్టంతో పాటు  వడ్డీలకు తెచ్చిపెట్టిన డబ్బులు మునిగిపోయాయని,రైతులు రోడ్డుపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో వున్న 30 మండలాల్లో 14 మండలాల్లో కరువు తాండవిస్తోందని,మరో 14 మండలాల్లో తుఫాన్‌ కారణంగా రైతులు సర్వం కోల్పొయారన్నారు. ఎక్కడోవున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలిసింది రైతులు నష్టపోయారని, తన సొంత జిల్లాలో రైతాంగా నష్టపోయివుంటే రాష్ట్రముఖ్యమంత్రికి ‘‘తెలిసినట్టు లేదని’’ ఎద్దేవ చేశారు. నష్ట పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ పెద్దలకు విన్నవించామన్నారు .వారు కుడా పెద్ద మనుస్సుతో ఎపి రాష్ట్రానికి సుమారు రూ .493.5 కోట్ల నిధులను కేటాయించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి రైతుల పై నున్న అభిమానాన్ని చాటుకొన్నారు .కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఆదుకునేందుకు నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొంటామని మాటలు తప్ప చేసింది ఏమి లేదని వారు విమర్శించారు . భారతీయ జనతా పార్టీ తరపున తాము గత వారంరోజులుగా దెబ్బతిన్న పంటలను పరిశిలించి అన్నదాతల సాధక బాధలను అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి తిరుపతి పర్యటనలో తు తు మంత్రంగా నష్ట పోయిన రైతు సోదరులను పరమర్శించారే తప్ప,దెబ్బతిన్న పంటలను ప్రత్యక్షంగా ఎందుకు పరిశిలించాలేదని ప్రశ్నించారు .2014 మోడీ ప్రభుత్వం దేశంలో అధికారం చేపట్టాక రైతు అభివృద్ధికి పెద్దపీఠ వేస్తున్నారని పేర్కొన్నార. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం వుందన్నారు.అధికారులను,ప్రజాప్రతినిధులు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు,జాయింట్‌ కలెక్టర్‌ అందుబాటులో లేకపోవడంతో డిఆర్వో(డిస్టిక్‌ రెవెన్యూ అధికారికి) వినతిపత్రం సమర్పించారు.కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్‌ మోర్చా ఉద్యానవన కన్వీనర్‌ మనోహార్‌ గౌడ్‌,కిసాన్‌ మోర్చా జోనల్‌ ఇంఛార్జి కే. వెంకట్రామ రాజు,కిసాన్‌ మోర్చా అధ్యక్షులు జయప్రకాష్‌ నారాయణ వర్మ ,ఓబీసీ జిల్లా అధ్యక్షులు రేపన శివ ప్రసాద్‌,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ గజపతి రాజు పాల్గొని ప్రసంగించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *