ఫేర్‌`ఫ్రీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అనేది అమాయక భావన కాదు. దాని అమలుకు సంబంధించి అనేక ట్రయల్స్‌, ప్రయోగాలు నిర్వహించారు.ప్రపంచ దేశాలలో మొదటిసారిగా అందరికీ ప్రజా రవాణాను ఉచితంగా కల్పించే విధానాన్ని 2020 ఫిబ్రవరి 29న లక్సెంబర్గ్‌ దేశం ప్రవేశపెట్టింది. తరువాత మాల్టా దేశం 2022 అక్టోబర్‌ 1న ప్రవేశపెట్టింది. 4 లక్షల 20 వేల మందికి పైబడిన జనాభా కలిగిన ఎస్టోనియా దేశ రాజధాని టాలిన్‌ నగరంలో, అలాగే మధ్యస్థ జనాభా కలిగిన పలు యూరోపియన్‌ నగరాలు, ప్రపంచంలోని అనేక చిన్న పట్టణాలు కూడా తమ ప్రజా రవాణా నెట్‌వర్క్‌లను జీరో`ఫేర్‌గా మార్చుకున్నాయి. బెల్జియంలోని హాసెల్ట్‌ నగరంలో 1997లోనే ఛార్జీలు రద్దు చేశారు. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో 14 గ్రావిూణ రవాణా వ్యవస్థలు 2020 సంవత్సరం నుంచి శాశ్వతంగా జీరో`ఫేర్‌ విధానాన్ని అవలంభిస్తున్నాయి. ఇక్కడ 2022 సెప్టెంబర్‌ నుండి పలు లోకల్‌, అంతర నగర రవాణా వ్యవస్థలలో 18 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల ప్రయాణీకులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించారు. మన దేశంలో చూస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల కోసం పథకాన్ని 2019 జూన్‌ 3న ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించారు, దీని కింద ప్రభుత్వం ఢల్లీి ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. 2021 న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా బేసిక్‌ ఫేర్‌ పథకంతో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రంలో నాన్‌ ఎ.సి ప్రభుత్వ బస్సుల్లో విద్యార్థులు, మహిళలతోపాటు ట్రాన్స్జెండర్‌లకు ఛార్జీలు లేని ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి అనే పేరిట పథకం 2023 జూన్‌ 11న ప్రారంభించారు. ఈ ప్రకటనను మహిళా జనాభాలోని విస్తారమైన వర్గాలు సంతోషంతో స్వాగతించాయి. దీని వలన అనేక ఉపయోగాలున్నాయి.వ్యక్తిగత వాహనాలు లేని మహిళలు, తక్కువ సామాజిక`ఆర్థిక నేపథ్యాలకు చెందిన మహిళలు ఎక్కువగా వారి నివాసానికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలో ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. ఇది వారికి అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాల సంఖ్యను పరిమితం చేస్తుంది. ఛార్జీల రహిత బస్సు ప్రయాణాన్ని అందించడం వల్ల మహిళలు ఇంటికి దూరంగా ఉన్న ఉద్యోగాలను కూడా చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఇది శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని మెరుగుపరుస్తుంది. కుటుంబంపై ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది. బస్సులలో నగరాలలో మహిళలు ఉపాధి కొరకు వెళ్ళడం వలన ఇంతకు ముందు వారు పొందుతున్న వేతనాల కంటే ఎక్కువ సంపాదించుకోగలుగుతారు. ప్రస్తుతం తమ సంపాదనలో కొంత భాగాన్ని బస్‌ ఛార్జీల కోసం వెచ్చిస్తున్న మహిళలు ఆదా చేయగలుగుతారు. దీనిని విద్య లేదా ఆరోగ్య సంరక్షణ వంటి ఇతర ప్రాథమిక ఖర్చులకు ఉపయోగించుకుంటారు.కళాశాలల స్వంత బస్సుల చార్జీల మోత భరించ లేక కేవలం దగ్గర్లో ఉన్న కారణాన్న బోధనలో నాణ్యతా ప్రమాణాలు లేకపోయినా కొన్ని కళాశాలలో బాలికలు తమ విద్యను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వీరు ఉచిత ప్రయాణం వలన నగరాలలో నాణ్యత కలిగిన విద్యను అభ్యసించగలుగుతారు.గ్రావిూణ ప్రాంతాలకు చెందిన అనేక మంది మహిళలు వారి తక్కువ ఆదాయం కారణంగా నాణ్యమైన వైద్య సేవలను పొందలేకపోతున్నారు. తనిఖీలు, అపాయింట్‌మెంట్‌ల కోసం క్రమం తప్పకుండా ఒక నగరం నుండి మరొక నగరానికి ప్రయాణించేటప్పుడు అయ్యే ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ పథకం కింద ప్రయాణానికి అయ్యే ఖర్చు లేకపోవడం వలన నాణ్యమైన చికిత్సలను పొందడానికి పట్టణాలకు పోవచ్చు. ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగు పరచవచ్చు.వ్యక్తిగత వాహనాలతో పోల్చితే బస్సు ప్రయాణం పర్యావరణానికి అనుకూలంగా మారుతుంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ ప్రయాణీకులు వారి గమ్యాన్ని చేరుకోవచ్చు. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడతాయి. సుమారుగా ఒక 50 వ్యక్తిగత వాహనాలలో వెళ్లేవారు ఒక బస్సులో వెళ్ళగలరు. రోడ్లపై ట్రాఫిక్‌ తగ్గుతుంది. మహిళలు షాపింగ్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు. డబ్బులు పెట్టి ప్రయాణం చేసే మహిళల ఆలోచనా విధానంలో కూడా మార్పు వస్తుంది. సాధారణ బస్సులలో రద్దీ ఎక్కువ ఉండే సమయంలో ఏసీ బస్సులలో వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్ర జి.డి.పి కూడా పెరుగుతుంది.కొంత మంది రాజకీయం చేయాలని ఈ పథకాన్ని విఫలయత్నం చేయడానికి రకరకాల కుయుక్తులు పన్నుతారు. కానీ పరిష్కారాలు వాళ్ళని తలదన్నే విధంగా ఉండాలి. బస్సు సర్వీసుల సమయపాలన, ఫ్రీక్వెన్సీ మెరుగుపరచాలి. మహిళలు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించకుండా సిగ్గుపడటానికి మరొక కారణం అధిక రద్దీ. రద్దీ తరచుగా లైంగిక వేధింపులకు సహాయపడే పరిస్థితిని సృష్టిస్తుంది. దీనికి పరిష్కారంగా అప్పుడప్పుడు బస్సులలో మఫ్టీలో మహిళా పోలీసులు ప్రయాణించాలి. దీని కోసం ఒక ప్రత్యేకమైన స్క్వాడ్‌ని ఏర్పాటుచేయాలి. చివరి స్టాప్‌ వచ్చేంత వరకూ మహిళల భద్రతకు భరోసా కలిగించాలి. బస్‌ డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ గార్డులు, టికెట్‌ కలెక్టర్లు మొదలైన ఫ్రంట్‌లైన్‌ పాత్రల్లో ఎక్కువ మంది మహిళలను నియమించడం ద్వారా మహిళల భద్రతను మెరుగుపరచవచ్చు. ప్రయాణించే మహిళల ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవడం, వారు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించడానికి ఒక టోల్‌ ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలి. ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని సవిూక్షించి, అవసరమైన దగ్గర మార్పులు చేర్పులు చేపట్టాలి. జనాదరణ పొందిన ఈ పథకం మహిళలు మరియు ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం రాజకీయ జిమ్మిక్‌ కాదని, ఇది మహిళా సాధికారతకు దారితీసే మొదటి అడుగు అని నమ్మకం కలిగించాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *