ఇద్దరు సీఐలు సస్సెండ్‌
కరెంట్‌ షాక్‌ పెట్టిన ఒక సిఐ
వికలాంగుడిని చావబాదిన మరోక సిఐ
థర్డ్‌ డిగ్రీ ఉపయోగించవద్దని డీఐజీ హెచ్చరిక
అనంతపురం
అనంతపురం జిల్లాలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఇద్దరు పోలీస్‌ అధికారులపై వేటు పడిరది. తాడిపత్రి అర్బన్‌ సీఐ హవిూద్ఖాన్‌, బుక్కరాయసముద్రం సీఐ నాగార్జునరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ అనంతపురం రేంజ్‌ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరినీ ఎస్పీ అన్బురాజన్‌ మధ్యాహ్నం వీఆర్కు తీసుకొస్తూ ఆదేశాలిచ్చారు. ఆ తరువాత కొన్ని గంటలకే సస్పెండ్‌ చేస్తూ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులివ్వడం పోలీస్‌ శాఖలో కలకలం రేపింది.
కొందరు పోలీసుల తీరు వివాదాస్పదమవుతోంది. నిందితుల పట్ల విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు అని కూడా చూడకుండా కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. కరెంట్‌ షాక్‌, థర్డ్‌ డిగ్రీ లాంటివి ప్రయోగిస్తూ చిత్ర హింసలకు గురి చేస్తున్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టవద్దనే రూల్‌ ఉన్నప్పటికీ పోలీసులు బేఖాతరు చేస్తున్నారు. నిందితులపై లాఠీన్యం చూపుతున్నారు. కాళ్లు, చేతులు, ఒళ్లు వాచిపోయేలా కొడుతున్నారు. అయినా చాలా చోట్ల ఇలాంటివి బయటకు రావడంలేదు. కానీ రెండు ఘటనలు మాత్రం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారుల సీరియస్‌ అయ్యారు. ఇద్దరు పోలీస్‌ అధికారులను సస్పెండ్‌ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐతో పాటు బుక్కరాయసముద్రం సీఐలపై డీఐజీ అమ్మిరెడ్డి చర్యలు తీసుకున్నారు. యువకుడికి కరెంట్‌ షాక్‌ ట్రీట్‌ మెంట్‌ ఇచ్చారని తాడిపత్రి సీఐ హవిూద్‌ ఖాన్ను సెస్పెండ్‌ చేయగా..వికలాంగుడిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని బుక్కరాయసముద్రం సీఐ నాగార్జున రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాలని, కానీ థర్డ్‌ డిగ్రీ ఉపయోగించొద్దని పోలీసులకు డీఐజీ అమ్మిరెడ్డి సూచించారు. పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *