పత్తికొండ:గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష ప్రక్రియకు దుర్వినియోగానికి పాలపడితే కఠిన చర్యలు తప్పవని ఆర్డిఓ రామలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం గర్భస్థ పిండ నిర్ధారణ పరీక్ష నివారణ చట్టం పై ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం
ఆర్డిఓ రామలక్ష్మిమాట్లాడుతూ ఈ చట్టం ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పరీక్ష నిర్వహించే వారికి మరియు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకునే వారికి మరియు పరీక్షకు ప్రోత్సహించిన వారికి కూడా కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చట్టం ప్రకారం లింగ నిర్ధారణని నిర్వహించిన వైద్యులు కూడా శిక్షార్హులని తెలిపారు గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టంపై క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఇతరత్రా సంఘాలు అన్ని కలిసి క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించాలని బాలికా నిష్పత్తిని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్‌ మరియు డివిజనల్‌ సూపర్డెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ శ్రీనివాసరెడ్డి నెంబర్లు డాక్టర్‌ అరుణ్‌ మరియు డాక్టర్‌ కల్పన మరియు జిల్లా ఎక్స్టెన్షన్‌ మాస్‌ విూడియా అధికారి ప్రవిూల మరియు మైత్రి చారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు రామ్మోహన్‌ మరియు హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అక్బర్‌ బాషా పాల్గొనడం జరిగింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *