విశాఖపట్టణం, డిసెంబర్‌ 5: రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు పూర్తయ్యాయి. సమన్వయ కమిటీ సమావేశాలు సైతం సంతృప్తికరంగా జరిగాయి. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ ప్రయత్నిస్తోందని..తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. అక్కడి ప్రజలు మార్పు కోరుకున్నారు. కెసిఆర్‌ ను అధికారం నుంచి దూరం చేసి కాంగ్రెస్‌ కు పట్టం కట్టారు. ఇక తరువాత అందరూ చూపు ఏపీపైన పడిరది. ఇక్కడ కూడా మార్పు తధ్యమని టిడిపి, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికీ ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ఎన్నికల సవిూపిస్తున్న నేపథ్యంలో దూకుడు పెంచాలనిఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు,పవన్‌ లు డిసైడ్‌ అయ్యారు. భారీ బహిరంగ సభకు సైతం ప్లాన్‌ చేశారు. ఇరువురు నేతలతో పాటు రెండు పార్టీలకు చెందిన కీలక నాయకులు సభలో మెరవనున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో టిడిపి, జనసేన ఆత్మీయ సమావేశాలు పూర్తయ్యాయి. సమన్వయ కమిటీ సమావేశాలు సైతం సంతృప్తికరంగా జరిగాయి. రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ ప్రయత్నిస్తోందని.. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో పొత్తు అనివార్యమని.. ఈ పొత్తు రాష్ట్ర ప్రజల కోసమేనని పవన్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. పార్టీ శ్రేణులకు దిశా,నిర్దేశం చేశారు.అయితే సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు పై అటు చంద్రబాబు, ఇటు పవన్‌ ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు. ముందుగా ఇరువురు నేతలు బయటకు వచ్చిరెండు పార్టీల శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలకు బలమైన సందేశం ఇవ్వాలని భావిస్తున్నారు.  ఈ నెల 17 నాటికి యువగళం పాదయాత్ర భీమిలికి చేరుకుంటుంది. ఈ నియోజకవర్గంలో యాత్రను ముగించనున్నారు.డిసెంబర్‌ 6న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు యువగళం పాదయాత్ర చేరుకుంటుంది. అక్కడ నుంచి 11 రోజులపాటు విశాఖపట్నం వ్యాప్తంగా లోకేశ్‌ పాదయాత్ర చేయబోతున్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ భూ కబ్జాలు, అక్రమాలు, రిషికొండ తవ్వకాలు వంటి వాటిపై నారా లోకేశ్‌ తన గళాన్ని వినిపించనున్నారు. అనంతరం డిసెంబర్‌ 17న పాదయాత్రకు ముగింపు సభ ఉంటుంది.ఈనెల 17న పాదయాత్ర ముగియనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు ప్లాన్‌ చేస్తున్నారు. లక్షలాదిమంది కార్యకర్తలతో భారీ విూటింగ్‌ కు టిడిపి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభకు చంద్రబాబు, పవన్‌ లతోపాటు రెండు పార్టీల నాయకులు, శ్రేణులు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల సమర శంఖం పూరించాలని డిసైడ్‌ అయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *