హాకీ వీరుడుగా, హాకీ మాంత్రికుడుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ 29 ఆగస్టు 1905న ప్రయాగలో జన్మించారు. ఆయన జయంతి రోజుని జాతీయ క్రీడా దినంగా మనం జరుపుకుంటాం.1926 నుంచి 1948 వరకు 22 సంవత్సరాలలో ఆయన కెరీర్‌లో 400 అంతర్జాతీయ గోల్స్‌ కలిపి మొత్తం 1,000 గోల్స్‌ సాధించాడు. ధ్యాన్‌ చంద్‌ నాయకత్వంలో, భారత హాకీ జట్టు అనేక విజయాలు సాధించింది.ఆయన 1928, 1932, 1936లో భారతదేశానికి 3 ఒలింపిక్‌ బంగారు పతకాలు సాధించంలో ముఖ్య పాత్ర పోషించాడు. మూడు సార్లు వరుసగా ఒలింపిక్‌ బంగారు పతకాన్ని గెలుచుకొని తన పేరు చరిత్ర పుటలలో ఎక్కించుకున్నారు. తన క్రీడా పాటవం ద్వారా ప్రపంచదేశాలలో భారత విజయ పతాకాన్ని రెపరెపలాడిరచినధ్యాన్‌ చంద్‌ జీవిత విశేషాలను కొన్నింటినిగుర్తుచేసుకుందాం.1. 1928లో అంస్టర్డామ్‌, 1932 లాస్‌ ఏంజిల్స్‌, 1936 బీర్లిన్‌ లలోజరిగిన ఒలంపిక్‌ క్రీడలలో ధ్యాన్‌ చంద్‌ నాయకత్వంలోని హాకీజట్టుస్వర్ణపతకాలను సాధించింది. ఈ క్రీడలలో జరిగిన మొత్తం 48 మ్యాచ్‌ లనూ భారత హాకీ జట్టుగెలుపొందడం విశేషం. భారత హాకీజట్టుకి ప్రపంచంలో 20 ఏళ్ళ పాటుఎదురే లేకపోయింది. భారత్‌ తో తలబడిన అన్ని మ్యాచ్లలోనూ అమెరికా అతి ఘోరంగా పరాజయం పాలయ్యింది. ఇదిజీర్ణించుకోలేని అమెరికా కొన్నేళ్ళ పాటు దేశంలో హాకీనినిషేధించింది. ఇంతకన్నా అద్భుత విజయం ప్రపంచంక్రీడారంగంలో ఇంకేముంటుంది?. జర్మన్‌ తో జరిగిన ఒక మ్యాచ్‌ లో జర్మన్‌ గోల్‌ కీపర్ధ్యాన్‌ చంద్‌ ని బాగా గాయపరిచాడు. ఇందుకు తగినవిధంగా బదులు తీర్చుకోవాలని ధ్యాన్‌ చంద్‌ తనజట్టుకి సూచించేడు. అంతే .. ప్రతిసారీ బంతిని భారతజట్టు గోల్‌ దాకా తీసుకువెళ్ళి గోల్‌ చెయ్యకుండావదిలేసింది. భారత క్రీడాకారులు ఇలా చెయ్యడంతో జర్మన్‌ క్రీడాకారులకు, జర్మన్‌ ప్రేక్షకులకు తలకొట్టేసినట్లయ్యింది.
జర్మన్‌ నియంత హిట్లర్‌ ఆ ఆటను ప్రత్యక్షంగా తిలకిస్తున్నాడు. హిట్లర్‌ సాక్షిగా జర్మన్‌ ఆటగాళ్ళను సవాలు చేయడం అక్కడున్నవారందరినీ ఆశ్చర్యపరిచింది. ధ్యాన్‌ చంద్‌ చూపిన తెగువ హిట్లర్‌ ని ఆకర్షించింది. ధ్యాన్‌ చంద్‌ కి జర్మన్‌ నియంత హిట్లర్‌ వీరాభిమాని. తనదేశం తరఫున ఆడమనీ, జర్మన్‌ పౌరసత్వం ఇస్తాననీ, కోరినంత ధనం ఇస్తాననీ, తన సైన్యంలో పెద్దహోదా ఇస్తాననీ హిట్లర్‌ ధ్యాన్‌ చంద్‌ ని ఆహ్వానించాడు. కానీధ్యాన్‌ చంద్‌ తాన దేశం కోసమే గాని డబ్బు కోసం ఆడటంలేదనీ చెప్పి హిట్లర్‌ ఆహ్వానాన్ని తిరస్కరించాడు. మనదేశానికి స్వాతంత్య్రం రాక ముందే భారతజయకేతనాన్ని దేశం వెలుపల (జర్మనీలో) ఎగురవేసిన ఏకైక భారతీయుడు ధ్యాన్‌ చంద్‌. మన దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటిష్‌ వారు మన పతాకాన్ని ఇతర దేశాలకు తీసుకెళ్ళనిచ్చేవారు కాదు. కానీ ధ్యాన్‌ చంద్‌ ఎవరు గుర్తించకుండా తన నైట్‌ డ్రెస్‌ లో జెండాని దాచి జర్మనీలో ఎగురవేయడానికి తీసుకెళ్ళాడు. ఇందుకు ఎంతో ధైర్యం కావాలి. జర్మనీలో భారత పతాకాన్ని ఎగురవేయడంపై ఆగ్రహించిన బ్రిటిష్‌ ప్రభుత్వం ధ్యాన్‌ చంద్‌ ని అరెస్టుచెయ్యాలని ప్రకటించింది. అయితే జర్మనీలో ధ్యాన్చంద్‌ అరెస్ట్‌ కాబడకుండా హిట్లర్‌ జాగ్రత్తలు తీసుకున్నాడు. క్రీడారంగంలో భారతదేశానికి అంతర్జాతీయంగా ఖ్యాతినార్జించి పెట్టిన ధ్యాన్‌ చంద్‌ తన చివరి రోజులలోఎటువంటి గుర్తింపు లేకుండా కడు దుర్భరజీవితాన్ని గడిపేడు. పొట్ట నింపుకోవడానికి కూడా సరిపడ డబ్బుల్లేని పేదరికంలో జీవించేడు. అటువంటిసమయంలో తమ దేశాలలోని హాకీ జట్టులకు శిక్షణనివ్వమంటూ అమెరికా, జర్మనీలు ధ్యాన్‌ చంద్‌ ని ఆహ్వానించేయి. పరాయి దేశాలకు శిక్షణనివ్వడం ద్వారా భవిష్యత్తులో భారత క్రీడాకారులకు విజయాలను దూరం చెయ్యలేనని చెప్తూ ధ్యాన్‌ చంద్‌ ఆ ఆహ్వానాలను త్రోసిపుచ్చేడు. ఇటువంటి గొప్పదేశభక్తుడిని స్వతంత్ర భారత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం విచారకరం. చివరి రోజులలో ఇండియన్‌ ఆర్మీ అతనిని ఆదుకుంది. ఒకసారి అహ్మదాబాదులో జరిగిన హాకీ మ్యాచ్‌ చూడటానికి ధ్యాన్‌ చంద్‌ వెళ్తే అతనిని గుర్తించకపోవడం వల్ల స్టేడియం లోనికి వెళ్ళనివ్వలేదు. అదే స్టేడియంలో ఆమ్యాచ్‌ ని జవహర్లాల్‌ నెహ్రూ తిలకిస్తూన్నాడు. మన దేశంలో ఏమాత్రం గుర్తింపుకు నోచుకోని ధ్యాన్చాంద్‌ ని స్వాతంత్య్రానికి పూర్వమే ఏభైకి పైగా దేశాలు 400కి పైగా అవార్డులతో సత్కరించేయి. 1979 డిసెంబర్‌ 3 న ధ్యాన్‌ చాంద్‌ స్వర్గాస్తులయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *