విశాఖపట్టణం, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంచలనానికి కేరాఫ్‌గా మారిన కోడికత్తి దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ మరోసారి తేల్చి చెప్పింది. హైకోర్టు సింగిల్ జడ్జి ముందు వాదనలు వినిపించిన ఎన్‌ఐఏ… ఈ కేసులో శ్రీనివాసరావు తప్ప వేరే వారి పాత్ర లేదని స్పష్టం చేసింది. ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఇద్దరు జడ్జిలతో కూడిన బెంచ్ విచారణ జరపాలని అభిప్రాయపడిరది. కోడికత్తి దాడి కేసులో మరింత లోతైన దర్యాప్తు కావాలని సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ముందు ఎన్‌ఐఏ వాదనలు వినిపించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్‌ఐఏ తరుఫు న్యాయవాదులు… ఈ కేసులో శ్రీనివాసరావు తప్ప వేరే వ్యక్తి గానీ, పార్టీ ఉన్నట్టు సాక్ష్యాలు ఎక్కడా లేవని స్పష్టం చేశారు. ఏ విషయాన్ని వదలకుండా క్షుణ్ణంగా దర్యాప్తు చేసినట్టు కోర్టుకు వివరించారు. ఇందులో ఎలాంటి కుట్రకోణం లేదని మరోసారి పునరుద్ఘాటించారు.పరిగణలోకి తీసుకొని జగన్ వేసిన పిటిషన్ కొట్టేయాలని అభ్యర్థించింది ఎన్‌ఐఏ. గతంలో విజయవాడ ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్న స్టేను కూడా ఎత్తేయాలని కోరింది. డివిజన్ బెంచ్ వద్ద విచారణకు వచ్చేలా రిజిస్ట్రీని ఆదేశించాలని పేర్కొంది. కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని చెబుతున్నప్పటికీ సీఎం జగన్ మాత్రం ఇందులో కుట్ర ఉందంటూ న్యాయపోరాటం చేస్తున్నారు. లోతైనా దర్యాప్తు కోసం ఇప్పటికే ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆ పిటిషన్‌ను జులై 25న కోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్‌జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి… ఎన్‌ఐఏ కోర్టు ఆదేశాలపై స్టే విధించారు. విచారమ ఎనిమిది వారాల పాటు స్టే విధించారు.