కొల్లు రవీంద్రలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు: హైకోర్ట్ ఆదేశాలు
అమరావతి నవంబర్ 27: మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రలపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఈ కేసుపై హైకోర్టులో విచారణకు రాగా.. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. గతంలో వాదనలు పూర్తికావడంతో లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదులు లిఖిత పూర్వక వాదనలు సమర్పించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దని.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. తీర్పు చెప్పే వరకు చంద్రబాబుపై ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టుల ఆదేశాలు జారీ చేసింది.