యాదాద్రి భువనగిరి నవంబర్‌ 27: బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే భూ మాఫియా చేస్తారని ప్రియాంకగాంధీ ఆరోపించారు. ఎన్నకల ప్రచారంలో భాగంగా ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజా సమస్యలు, ఉద్యోగాలు, ధరల పెరుగుదలపై పట్టించుకోలేదు. తెలంగాణలోని పెద్ద నేతలు ఫామ్‌ హౌస్‌లో ఉంటూ విలాస జీవితాన్ని గడుపుతున్నారు. భువనగిరి ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై ఎన్నడు నోరు మెదపలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పైనుంచి కింది వరకు అంతా అవినీతిమయం. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నేతలు ధనవంతులు, ప్రజలు మాత్రం పేదలు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగాలు రావు.. ధరణి పేరుతో ఉన్న భూమిని గుంజుకుంటారు. తెలంగాణ అప్పులు ఇంకా పదిరెట్లు పెరుగుతాయి.’’ అని ప్రియాంక విమర్శించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *