హైదరాబాద్‌, నవంబర్‌ 24:నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్కకు (కర్నె శిరీష) భద్రత కల్పించాలని ఇచ్చింది. ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ ఒక గన్‌ మెన్‌ ఆమె వెంట ఉండాలని, ఆమె నిర్వహించబోయే పబ్లిక్‌ విూటింగ్‌ లకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకు మాత్రమే భద్రత కల్పించడం సరికాదని, ముప్పు ఉన్న ప్రతి అభ్యర్థికి సెక్యురిటీ ఇవ్వాలని హైకోర్టు నిర్దేశించింది. పోలీసుల బాధ్యత కేవలం కార్లు చెక్‌ చేయడం కాదని కీలక వ్యాఖ్యలు చేసింది. రెండు రోజుల క్రితం కొల్లాపూర్‌ లో ప్రచారం నిర్వహిస్తున్న బర్రెలక్కపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్రెలక్కతో పాటు ఆమె తమ్ముడిపై కూడా దాడి చేశారు. ఆమె తమ్ముడిని తీవ్రంగా గాయాలపాలు చేశారు.ఈ దాడి నేపథ్యంలోనే తనకు 2 G 2 గన్‌ మెన్లతో భద్రత కల్పించాలని బర్రెలక్క తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. శుక్రవారం (నవంబరు 24) దీనిపై విచారణ జరిగింది. హైకోర్టుకు వెళ్లడానికి మద్దతుగా అంతర్జాతీయ న్యాయవాదుల సంఘం నాయకులు కావేట శ్రీనివాసరావు, కరణం రాజేశ్‌, ఆదిత్య దొడ్డల అండగా ఉన్నారు. బర్రెలక్కకు రక్షణ కల్పించాలని ఎస్పీని కూడా కోరతామని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *