విజయవాడ, సెప్టెంబర్‌ 26: ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా తీసుకు వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు సరికాదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (అంఉ) పేర్కొంది. 2020`21 ఆర్థిక ఏడాదికి సంబంధించిన నివేదికలను సమర్పించిన కాగ్‌.. వార్డు కమిటీలు లేకుండా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తన ఆడిట్‌ రిపోర్టులో వెల్లడిరచింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థల ఏర్పాటు పాలన వికేంద్రీకరణ కోసమే అని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. 2019 జులైలో ఈ వ్యవస్థను ఏపీ రాష్ట్ర సర్కారు తీసుకువచ్చింది. అయితే ఈ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించిందని కాగ్‌ తెలిపింది. క్షేత్రస్థాయిలో ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేయడం అంటే స్థానిక స్వపరిపాలనను దెబ్బతీయడమే అని పేర్కొంది. స్వపరిపాలన సాధనకు ప్రజా ప్రతినిధులతో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని కాగ్‌ సూచనలు చేసింది. 2019 ఫిబ్రవరి నుంచి అమరావతికి బడ్జెట్‌ తోడ్పాటు అందించలేదని కాగ్‌ తన 2020`21 రిపోర్టులో పేర్కొంది. అమరావతి అభివృద్ధికి రూ. 33,476 కోట్ల సవిూకరణ లక్ష్యంగా పెట్టుకున్నారని, ఏపీ సీఆర్డీఏ రూ. 8,540 కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు తెలిపింది. అమరావతి ప్రాంతంలో పనులు ఆపేయడం వల్ల నిధులు నిరుపయోగంగా ఉండిపోయాయని ప్రభుత్వ తీరును కాగ్‌ తప్పు బట్టింది. 2019 మే నెల నుంచి వివిధ పనులను నిలిపి వేశారన్న కాగ్‌ రిపోర్టు.. దీని వల్ల ఈ పనుల కోసం ఖర్చు చేసిన రూ.1505 కోట్లు నిరుపయోగం అయ్యాయని తెలిపింది. అమరావతి ప్రాంతంలో ల్యాండ్‌ పూలింగ్‌ భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రూ. 13,802 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదన ఉండగా.. దీనిలో 2021 నాటికి కేవలం రూ. 183 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు కాగ్‌ గుర్తించింది.విశాఖలో 876 పరిశ్రమల్లో 70 పరిశ్రమలు సరైన అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు కాగ్‌ తన రిపోర్టులో తెలిపింది. 2016 ` 2021 మధ్య పలు అవకతవకలు జరిగినట్లు కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. 2015`20 మధ్య కాలంలో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర గ్రాంట్లలో 129 కోట్ల తగ్గుదల.. 2016`18 మధ్య కాలంలో పని తీరు గ్రాంటులో 28.93 కోట్లకు కోత పడిరదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ తన నివేదికలో తెలిపింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *