కోరుట్ల: భారత్ క్రికెట్ చరిత్రలో ఓటమి లేకుండా ఫైనల్ చేరడం గొప్ప విషయమని క్రికెట్ అభిమాని, స్వర్ణకారుడు తుమ్మనపల్లి నరేష్ అన్నారు. కోరుట్ల మండలం అయిలపూర్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు నరేష్, ఓ స్వర్ణకారుడు తయారు చేసిన చిన్న 0.200 విూల్లీల స్వర్ణ కప్ ను చూసి, దానిని ఆదర్శంగా తీసుకొని, కష్టపడి 0.09 మిల్లీల స్వర్ణ ప్రపంచ కప్ తయారు చేశాడు. క్రికెట్ పై అభిమానంతో, మన భారత జైత్ర యాత్ర విజయాలతో ముందుకు సాగుతుంటే, ఎంత కష్టమైన ప్రపంచ కప్ నమూనాలో అతి చిన్న స్వర్ణ ప్రపంచ కప్ తయారు చేయడం అద్భుతమని అతని స్నేహితులు, క్రికెట్ అభిమానులు, గ్రామ ప్రజలు అతన్ని ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఆదివారం ఆస్ట్రేలియాను ఓడిరచి ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలని నరేష్ తో పాటు వారందరూ కోరారు.