బ్రిటీష్‌ పరిపాలనాకాలంలో వారి ఆకృత్యాలను అణిచివేసి, దేశాన్ని స్వాతంత్య్రం దిశగా తీసుకెళ్లిన స్వాతంత్య్ర సమరయోధులతో పాటు వీరవనితలు ఎందరో వున్నారు. ఓవైపు విదేశీ పాలకులతో పోరాడుతూనే.. మరోవైపు ప్రజారంజకంగా పాలించిన మహారాణులు మన దేశంలో జన్మించారు. అలాంటి వారిలో ధీరవనిత రaాన్సీ లక్ష్మీబాయి ఒకరు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మహిళా సైన్యాన్ని తయారుచేసిన ఘటన ఆమెది. ఈమె జీవించింది కేవలం 23 సంవత్సరాలే అయినప్పటికీ.. ఆమె అందించిన స్ఫూర్తి నేటికీ యువతలో ఉత్తేజాన్ని నింపుతోంది.రaాన్సీ లక్ష్మీబాయి’ అసలు పేర మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచవిూ నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్‌ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్‌ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్‌ లాంగ్‌ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్‌ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండుగా కలది.ఈమె పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి విూద పడిరది. బాల్యంలోనే గుర్రపు స్వారీ, కత్తిసాముల్లో ఆరితేరింది. ఈమెకు 13 ఏళ్ళ వయసులోనే 1842లో రaాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్‌ తో వివాహమైంది. దీంతో ఆమె రaాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. ఆ పెళ్ళి తర్వాత ఈమె జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. ఈమె 17వ ఏటలో వున్నప్పుడు 1851లో ఓ కుమారునికి జన్మనివ్వగా.. నాలుగు నెలల వయసులోనే ఆ బాలుడు మరణించాడు.
దీంతో లక్ష్మీబాయి దంపతులు ‘దామోదరరావు’ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారు. ఆ దత్తతను ఆమోదించాల్సిందిగా బ్రిటీష్‌ వారికి వారు అర్జీ కూడా పెట్టుకున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న తరుణంలో 1953నవంబర్‌ 21 లో గంగాధరరావు మరణించాడు. దీంతో రాజ్యపాలన మొత్తం లక్ష్మీబాయి విూదే పడిరది. ఆ తర్వాత లక్ష్మీబాయికి కష్టాలు మరిన్ని ఎక్కువయ్యాయి.ఆనాటి బ్రిటీష్‌ గవర్నర్‌ అయిన డల్హౌసి… లక్ష్మీబాయి భర్త గంగాధర మరణించడంతో దామోదరరావును దత్తత తీసుకోవడం చెల్లదని, రాజ్యాన్ని బ్రిటీష్‌ వారికి స్వాధీనం చేసి వెళ్లాలని ఆమెని ఆదేశించాడు. అందుకు ఆమె ఏమాత్రం ఒప్పుకోలేదు. దీంతో బ్రిటీష్‌ వారు తమదైన పన్నాగాలు పన్ని, రaాన్సీ రాజ్యంపైకి సరిహద్దు రాజ్యపాలకులను రెచ్చగొట్టింది. ఈ విషయాన్ని పసిగట్టిన లక్ష్మీబాయి.. తన రాజ్య సంరక్షణ కోనం నడుం బిగించి పెద్దఎత్తున సైన్యాన్ని తయారుచేసింది. ఇందులో భాగంగానే మహిళలకు సైతం శిక్షణనిచ్చి వారిని సైన్యంలో చేర్చుకుంది. ఈ సమయంలోనే ఆమె భారత స్వాతంత్య్రంపై చైతన్యం కల్పించింది. ఈ క్రమంలోనే ఆమె సిపాయి ఉద్యమంలో పాలుపంచుకుంటున్న నానాసాహెబ్‌, రావుసాహెబ్‌, తాంతియా తోపేలతో చేతులు కలిపింది. ఇంతలోనే బ్రిటీష్‌ సేనలు రaాన్సీలో ప్రవేశించి ప్రజల్ని నానా ఇబ్బందులకు గురిచేయడం మొదలుపెట్టాయి.రaాన్సీకి స్వేచ్చ కలిగించి లక్ష్మిబాయి ని స్వతంత్రుపరురాలు చేయటానికి తిరుగుబాటు దార్ల నాయకుడైన తాత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం పంపబడిరది. అప్పుడు బ్రిటిష్‌ వాళ్ళ దగ్గర 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నప్పటికీ.. వీళ్ళు చాలా శిక్షణ పొందినవాళ్ళు కావడంతో అనుభవం లేని తోపే సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్‌ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగాయి. ఆమె తన రక్షకులు చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోగలిగింది. బ్రిటిష్‌ సైన్యం క్రమంగా రaాన్సీని ముట్టడిరచడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది. తాత్యా తోపే ఉండే తిరుగుబాటు దారులతో చేరింది. రాణి, తాత్యా తోపే గ్వాలియర్‌ కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్‌ మహారాజ సైన్యాన్ని ఓడిరచి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసారు. తరువాత వాళ్ళు కపటోపాయముతో గ్వాలియర్‌ కోటను ఆక్రమించుకొన్నారు. కాని.. 1858 జూన్‌ 17వ తేదీన రెండో రోజు యుద్ధంలో రాణి మరణించింది. ఆమె బుల్లెట్‌ గాయాలు తగిలి మరణించిందని సమాచారం. ఇలా ఈ విధంగా రెండు వారాలపాటు విదేశీ సైన్యంతో వీరోచితంగా పోరాడి, వీరమరణం పొందింది.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *