రాయచోటి,16 నవంబర్ 2023: నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల కు చెందిన దళిత న్యాయవాది మంద విజయ భాస్కర్ పై దాడికి పాల్పడిన వైసిపి కార్యకర్తలను తక్షణం అరెస్టు చేయాలని అన్నమయ్య జిల్లా ప్రజా సంఘాలు, బహుజన న్యాయవాదుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో రాయచోటి అంబేద్కర్ ప్లెక్సీ వద్ద గురువారం ఉదయం మౌన దీక్ష చేపట్టారు. పోలీసులు న్యాయవాదిపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చర్యలు చేయకుండా , న్యాయవాదిపైనే కేసు నమోదు చేయడం దారుణమని బాధ్యుల పై తక్షణం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మౌన దీక్షలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు బహుజన న్యాయవాదులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందని చట్టాలు కోర్టులు రాజ్యాంగం ఇవేవీ కూడా జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని జగన్ అనుకున్న చట్టాలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారని వారు విమర్శించారు. చట్టపకారం నడుచుకుంటున్న న్యాయవాది విజయభాస్కర్ పై అరాచక శక్తులు నడిరోడ్డుపై కొట్టి అవమానించడం క్షమించరానీ నేరమని వారన్నారు. రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి అదే రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారైన వైసీపీ కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పరోక్షంగా ముఖ్యమంత్రి వారిని ప్రోత్సహించడం ఈ రాష్ట్ర పరిపాలన ఎటువైపు పోతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. మౌన దీక్షలో ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజనేయులు, భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లం తాతయ్య, పౌర హక్కుల సంఘం నాయకులు పి రెడ్డయ్య, ఓ పి డి ఆర్ నాయకులు ఈశ్వర్, బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు డి. నాగ ముని , అన్నమయ్య జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ రాజు, బహుజన న్యాయవాదుల సంఘం నాయకులు మంద నాగేశ్వరరావు ఉదయగిరి రామాంజనేయులు, విద్యావంతుల వేదిక నాయకులు జీవానందం , మారుతి శంకర్ చల్లా రెడ్డయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు నారాయణ లక్ష్మయ్య రామకృష్ణ కొలిమిట్ట రమణ, పామయ్యా, తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
ఫోటోలు: అంబేద్కర్ ఫ్లెక్సీ ఎదుట నల్ల బ్యాడ్జీలతో మౌన దీక్ష చేపట్టిన ప్రజా సంఘాలు బహుజన న్యాయవాదులు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *