గుంటూరు: రాజకీయంగా జిల్లాలో కార్యకర్తలు తో కలసి ముందుకు వెళ్తున్నాం. నరేంద్రమోదీ అవినీతి రహిత పాలన అందించారు ప్రజలకు సంక్షేమం కోసం బీజేపీ పెద్దపీట వేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. అన్ని వర్గాల్లో ఉన్నవారికి సంక్షేమం అందిస్తున్నాం. పేదలు ఎదుర్కొంటున్నా ఇబ్బందులు గురించి గరీబ్ కల్యాణ్ పథకాన్ని పొడిగిస్తున్నాం. పేదలకు అవావసయోజన ప్రవేశపెట్టిన నరేంద్రమోదీ. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర నిధులతో చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారు. గ్రామ సచివాలయం నిర్మాణం కూడా ఉపాధి నిధులతో కట్టినవి. అమరావతి రాజధాని అంశానికి బీజేపీ కట్టుబడి వుంది. మూడు రాజధానులు అంటూ ముడుముక్కలకు తెరవేశారు.మహిళల సైతం రాజదానికోసం ఉద్యమం చేస్తున్నారని అన్నారు.
500 కోట్లు నిధులతో గుంటూరు ను ఎం అభివృద్ధి చేశారు. వ్యవసాయానికి సంబంధించిన రీసెర్చ్ భవనాలకు కేంద్రం నిధుల మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు వైర్లను తొలగించిన వైనం. అమరావతిలో టూరిజం కోసం 70 కోట్లు మంజూరు చేయటం జరిగింది. పేద ప్రజలకు ఇళ్లను కేటాయింపు కోసం కేంద్రప్రభుత్వం లక్ష 70 వేలు మంజూరు చేసింది. రాష్ట్రంలో ఉన్న పాలకుల దృష్టి జేబులు నింపుకోవడానికి తప్ప సుపరిపాలన విూద లేదని ఆమె విమర్శించారు.