హైదరాబాద్ నవంబర్ 14:విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజకీయం ప్రస్థానం మొత్తం, అవినీతి,అక్రమాలు, వెన్నుపోటు తో కూడుకున్నవని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ఎన్నికలప్రచారం లో భాగంగా ఆయన విూడియా తో మాట్లాడుతూ ఇలాంటి వాళ్ళకు మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు ఓటు తో బుద్ది చెప్పాలని శ్రీరాములు యాదవ్ పిలుపు నిచారు.. కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొంది పార్టీ కి వెన్ను పోతూ పొడిచి అక్రమంగా సంపాదించిన ఆస్తులు కాపాడుకోడానికి, సి బీ ఐ కేసుల నుండి తపించుకోవటానికి, అధికార బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లిన సభితా ఇంద్రారెడ్డి ప్రజా ద్రోహి అని విమర్శించారు..చెరువుల సుందరికరణ పేరు తో కబ్జాలు చేయించిదని శ్రీరాములు యాదవ్ ఆరోపించారు.వీటన్నిటికి సబితా కొడుకు సూత్రదారి ఐతే ఆమె పాత్రదారి అని విమర్శించారు.ఈ నెల 30 న జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలిచి తీరుతుందని,బిఆర్‌ఎస్ అక్రమదారులు ఖబ్జాకోరుల సంకెళ్ళు వేయిస్తామని అన్నారు.