నిజామాబాద్, నవంబర్ 11: ఖరీఫ్ సీజన్ కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు వరి కోతల తరువాత ధాన్యాన్ని సాధారణంగా రోడ్లపై ఆరబెడతారు. కానీ ధాన్యం రోడ్లపై ఆరబెడితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని విూకు తెలుసా? వినడానికి కొత్తగా ఉన్న ఇది నిజం. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ పోలీస్ స్టేషన్‌లో ఓ రైతుపై భారత శిక్ష్మాస్మృతిలోని సెక్షన్ 304`బి కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆ రైతు రోడ్డుపై ధాన్యం ఆరబోయడం వల్ల బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళ ప్రమాదంలో మరణించింది. దీంతో పోలీసులు సంబంధిత ధాన్యం ఆరబెట్టిన రైతుపై కేసు నమోదు చేశారు. ఒక్క 304 సెక్షన్ కాకుండా పలు సెక్షన్లపై కేసులు నమోదు అయ్యే అవకాశముంది.ఇలా వరి దాన్యం ను రోడ్డుపై ఆరబెట్టడం వలన జరిగే ప్రమాదాలపై భారతదేశ శిక్ష స్మృతి ( ఎఖఅ) ప్రకారంగా విూ పై చట్ట రీత్య చర్యలు తీసుకోవడానికి అవకాశముంది.` సెక్షన్ 304 `? ఐ.పి.సి ప్రకారం ఇలా ఆరబెట్టిన ధాన్యల వలన రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరైన మరణిస్తే ఆరబెట్టిన యాజమానికి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తారు. కేసు విచారణ అనంతరం 10 సంవత్సరాల జైలు శిక్ష / జరిమాన విధించే ఆస్కారం ఉంది.`సెక్షన్ 188 ఐ.పి.సి ప్రకారం ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా వరి ధాన్యం జాతీయ రహదారులపై మరియు రాష్ట్ర రహదారులపై ,సర్వీసు రహదారులపై ఆరబెడితే ఆ యాజమానికి 6 నెలల జైలు శిక్ష / 1000 రూపాయల జరిమాన విధించే అవకాశముంది.
`సెక్షన్ 283 ఐ.పి.సి ప్రకారం ఏదైన పబ్లిక్ మార్గాంలో వరి ధాన్యం ఆరబెట్టడం ద్వారా ఏదైన వ్యక్తికి ప్రమాదం, ఆటంకం లేదా గాయం కలిగినట్లయితే న్యాయస్థానం ద్వారా శిక్షించబడుతారు.
`సెక్షన్ 341 ఐ.పి.సి ప్రకారం రహదారులపై వరిధాన్యం ఆరబెట్టినందుకు యాజమానికి 1 నెల జైలు శిక్ష / 500 రూపాయల జరిమాన విధించే ఆస్కారం గలదు.
`అండర్ సెక్షన్ 337 ఐ.పి.సి ప్రకారం ఇలా ఆరబెట్టిన ధాన్యల వలన రోడ్డు ప్రమాదాలు జరిగి సాధారణ గాయం అయితే ఆరబెట్టిన యాజమానికి 6 నెలల జైలు శిక్ష/ 500 రూపాయల జరిమానా.
`సెక్షన్ 338 ఐ.పి.సి ప్రకారం ఆరబెట్టిన ధాన్యం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి తీవ్ర గాయలు అయితే ఆరబెట్టిన యాజమానికి 2 సంవత్సరాల జైలు శిక్ష / 1000 రూపాయల జరిమానా.
`పి.డి.పి.పి యాక్టు సెక్షన్ 03 ప్రకారంగా ఎవరైనా ప్రజల యొక్క ఆస్తులు అనగా రోడ్లు, భవనాలు మరియు ఇతర ప్రభుత్వ ఆస్తులను ద్వంసం చేసిన ఆస్తులను అనగా పబ్లిక్ రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టడం వలన రోడ్లు ద్వంసం అయ్యే అవకాశాలు ఉన్నందున సదరు యాజమాన్యం పై ఈ సెక్షన్ ప్రకారంగా కూడా చట్ట రీత్యా చర్యలు తీసుకుంటారు.
గతంలో నమోదైన కేసులు :
`2021 సంవత్సరం కేసులు R 04 నమోదు ,
మృతులు సంఖ్య R03
క్షతగాత్రుల సంఖ్యR01.
`2022 సంవత్సరంలో మొత్తం కేసులు R. 06 నమోదు,
మృతుల సంఖ్య R 05
క్షతగాత్రుల సంఖ్యR 01
2023 వ సంవత్సరం 11వ నెల 8వ తేదీ వరకు మొత్తం కేసులు నమోదు R 05
మృతుల సంఖ్య R. 04
క్షతగాత్రుల సంఖ్యR03