అంగన్వాడి సమస్యల పరిష్కరించాలని, యూనియన్, సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విజయవాడ సోమవారం ధర్నా చౌక్ లో ధర్నాకు పిలుపునివ్వగా, రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కరించకుండా, పోలీసులు ఉపయోగించుకొని, నాయకుల్ని, అంగన్వాడి మహిళల్ని, నోటీస్ లిచ్చి, గృహనిర్బంధం చేసి, ఎక్కడపడితే అక్కడ అక్రమ అరెస్టులు చేసినందుకు, నిరసనగా, సోమవారం, కోడూరులో ఐసిడిఎస్ ఆఫీసు నుండి టోల్గేట్ మీదగా అంబేద్కర్ సర్కిల్, వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, పోలీస్ స్టేషన్ వద్ద రాస్తారోకో బైఠాయించగా, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ ని పోలీసులు అరెస్టు చేయగా, అంగన్వాడి మహిళలు నాయక్ ని విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ముట్టడించారు.   అనంతరం విడుదల చేశారు . చంద్రశేఖర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని, తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పే నాలుగున్నర సంవత్సరమైనా అమలు చేయలేదని మాట తప్పిన సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు,  అక్రమ అరెస్టుల ఆపాలని, అరెస్టు చేసిన నాయకులను బేసరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం, సమస్యల పరిష్కరించకపోగా, పోలీసుల చేత, ఉద్యమాన్ని అనచాలని, నిర్బంధాన్ని ప్రయోగిస్తుందని, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా మహిళలను చూడకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని,  సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలని, పెన్షన్  సౌకర్యం అమలు చేయాలని, పేస్ యాప్లు  రద్దు చేయాలని, ఆరు సంవత్సరాల నుండి బకాయిలు ఉన్న  డి ఎ డి ఎ లు చెల్లించాలని డిమాండ్ చేశారు. నేడు జరిగే అసెంబ్లీలో ముఖ్యమంత్రి సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు, లేకుంటే  నిరవధిక సమ్మెలో పోతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రాజెక్టు కోశాధికారి , జి పద్మావతి,  వెన్నెల, దుర్గా, ఈశ్వరమ్మ, కుమారి, మాధవి, రోజా,  మనేమ్మ, రెడ్డమ్మ,సునీత, నిర్మల, శ్రీదేవి,  తదితరులు పాల్గొన్నారు.కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, మెనీ వర్కర్లు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *